- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Google: రిమోట్ వర్క్ వల్లే గూగుల్ ఏఐలో వెనుకబడి ఉంది: మాజీ సీఈఓ స్మిత్
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ మాజీ సీఈఓ ఎరిక్ స్మిత్ ఏఐ టెక్నాలజీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రిమోట్ వర్క్ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) రంగంపై పడుతున్న ప్రభావంపై ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంసమయ్యాయి. గూగుల్ కంపెనీ ఏఐ విభాగంలో వెనుబకబడేందుకు రిమోట్ వర్క్ ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల ఎరిక్ స్మిత్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించిన వీడియో యూట్యూబ్‌లో ప్రసారమైంది. రిమోట్ వర్క్ కారణంగా ఏఐ రంగంలో గూగుల్ పోటీ ఎదుర్కొనలేకపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గూగుల్ సంస్థ ఉద్యోగుల వర్క్-లైఫ్ బ్యాలెన్స్, రిమోట్ వర్క్ అవకాశాలపై దృష్టి సారించడం వల్లనే ఏఐ టెక్నాలజీ వృద్ధిలో వెనుకబడి ఉండోచ్చని స్మిత్ తెలిపారు. ఏఐ రంగంలో విజయం సాధించడం కంటే వర్క్-లైఫ్ బ్యాలెన్స్, త్వరగా ఇంటికి చేరడం, వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమని గూగుల్ భావించింది. సాధారణంగా టెక్ దిగ్గజాలు పరిశ్రమలు కొత్త దశకు చేరుకుంటున్న తరుణంలో వైఫల్యాలను చూడటం సహజమే. అలాంటి సందర్భాల్లో సృజనాత్మకంగా ముందుకెళ్లగలిగే నిర్ణయాలు తీసుకోవాలని, అత్యంత ప్రతిభావంతుల ద్వారా వృద్ధి సాధించాలన్నారు. తైవాన్‌లోని సెమీ కండక్టర్ పరిశ్రమ పీహెచ్‌డీ చేసిన వారి ద్వారా వేగవంతంగా విస్తరిస్తోందన్నారు.