- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుజరాత్‌లో గ్లోబల్ ఫిన్‌టెక్ ఆపరేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్న గూగుల్
వాషింగ్టన్: టెక్ దిగ్గజం గూగుల్ గుజరాత్‌లోని గిఫ్ట్(GIFT) సిటీలో కొత్తగా గ్లోబల్ ఫిన్‌టెక్ ఆపరేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. అమెరికాలో ప్రధాని మోడీతో సమావేశం అనంతరం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ విషయాన్ని పేర్కొన్నారు. భారతదేశ డిజిటలైజేషన్ కార్యక్రమంలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు పిచాయ్ తెలిపారు. గిఫ్ట్ సిటీగా ప్రసిద్ధి చెందిన గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ గాంధీనగర్‌లో ఉంది.
డిజిటల్ ఇండియా దార్శనికత, దేశం సాధించిన పురోగతిని చూడటం చాలా ఉత్సాహంగా ఉందని సుందర్ పిచాయ్ ఆయన అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పనిచేసే కంపెనీలతో పాటు ఇతర కంపెనీలలో కూడా పెట్టుబడిని కొనసాగించడమే కాకుండా, ఏఐ ఆధారిత చాట్ బోట్‌లో మరిన్ని భారతీయ భాషలను యాడ్ చేయనున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్‌టెక్, పరిశోధన, సైబర్ సెక్యూరిటీ ఉత్పత్తులు, సేవల డొమైన్‌లతో పాటు భారతదేశంలో మొబైల్ పరికరాల తయారీలో సహకారానికి మరిన్ని మార్గాలను అన్వేషించడానికి భారత్‌తో కలిసి పనిచేస్తామని గూగుల్ సీఈఓ అన్నారు.