ఆధార్‌తో యూపీఐ యాక్టివేషన్ ఫీచర్ తెచ్చిన గూగుల్‌పే!

by Vinod kumar |   ( Updated:2023-06-07 14:46:31.0  )
ఆధార్‌తో యూపీఐ యాక్టివేషన్ ఫీచర్ తెచ్చిన గూగుల్‌పే!
X

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల ప్లాట్‌ఫాం గూగుల్‌పే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు డెబిక్ట్ కార్డు లేకపోయిన యూపీఐ పిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆధార్ వివరాలను ఉపయోగించి యూపీఐ చెల్లింపుల నిర్వహించవచ్చు. దీనికోసం ఆధార్ కార్డు, బ్యాంకులో నమోదైన ఫోన్ నంబర్ ఒకటే అయి ఉండాలి. అంతేకాకుండా బ్యాంకు అకౌంట్‌కు ఆధార్ అనుసంధానం చేసుండాలి. వినియోగదారుల ఆధార్ నంబర్‌లను తాము స్టోర్ చేయమని గూగుల్‌పే స్పష్టం చేసింది. ఈ కొత్త ఫీచర్ కావాలనుకునే వినియోగదారులు గూగుల్‌పే యాప్‌లో డెబిట్ కార్డు లేదా ఆధార్ అనే ఆప్షన్లు వస్తాయి.

ఆధార్ ద్వారా ప్రక్రియను ప్రారంభించేందుకు ఆధార్ కార్డులోని మొదటి ఆరు అంకెలను నమోదు చేయాలి. ఆ తర్వాత యూఐడీఏఐ, బ్యాంక్ నుంచి వచ్చే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత బ్యాంకు ప్రక్రియ పూర్తవుతుంది. అనంతరం యూపీఐ పిన్‌ని సెట్ చేసుకోవచ్చు. యూపీఐ యాక్టివేషన్ తర్వాత వినియోగదారులు గూగుల్‌పే యాప్‌ను ఉపయోగించి లావాదేవీలను నిర్వహించవచ్చు. బ్యాలెన్స్ చూసుకోవచ్చు. వినియోగదారులు తమ ఆధార్ నంబర్‌లోని మొదటి ఆరు అంకెలను ఎంటర్ చేసినపుడు ఆ సమాచారం ఎన్‌పీసీఐ ద్వారా యూఐడీఏఐకి బదిలీ అవుతుంది. కాబట్టి ఆధార్ నంబర్‌లను తాము స్టోర్ చేయమని గూగుల్‌పే వివరించింది.

Also Read..

SBI, HDFC, ICICI తో పాటు పలు బ్యాంకుల UPI రోజువారీ లిమిట్ ఎంతో తెలుసా..!

Advertisement

Next Story

Most Viewed