- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పైథాన్ టీమ్‌లో మొత్తం ఉద్యోగులను తొలగించిన గూగుల్

దిశ, బిజినెస్ బ్యూరో: టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ గత కొన్ని వారాలుగా వివిధ విభాగాల్లో లేఆఫ్స్ ప్రకటిస్తోంది. తాజాగా కంపెనీకి చెందిన పైథాన్ టీమ్‌లో ఉన్న ఉద్యోగులందరినీ తొలగించినట్టు తెలుస్తోంది. ప్రముఖ ఫ్రీ ప్రెస్ జర్నల్ ప్రకారం, కంపెనీ ఖర్చులను తగ్గించుకునేందుకు అమెరికాకు వెలుపల తక్కువ జీతంతో పనిచేసే వారిని నియమించుకునేందుకు గూగుల్ యోచిస్తోంది. ఇప్పటికే జర్మనీలోని మ్యూనిచ్‌లో గూగుల్ పూర్తిగా కొత్త టీమ్‌ని నియమిస్తోంది. అమెరికాలోని పైథాన్ టీమ్‌లో 10 మంది కంటే తక్కువ మందితో కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది. ఉన్న కొంతమందికి పైథాన్ స్టేబుల్ వెర్షన్‌ను నిర్వహించడం, థర్డ్-పార్టీ ప్యాకేజీలను అప్‌డేట్ చేయడం, టైప్ చెకర్‌ను అభివృద్ధి చేసే బాధ్యతలను అప్పగించింది. ఉద్యోగం కోల్పోయిన వారిలో ఓ మాజీ గూగుల్ పైథాన్ టీమ్ మెంబర్ 20 ఏళ్ల కెరీర్‌లో ఇది తనకు ఎంతో గొప్ప ఉద్యోగమని చెప్పారు. మేనేజర్‌తో సహా సంస్థతో నేరుగా పనిచేసే ప్రతి ఒక్కరినీ తొలగించడం బాధాకరమని మరో ఉద్యోగి తెలిపారు. కాగా, ఇటీవల గూగుల్ తన రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ విభాగాల్లోనూ ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ విభాగాల్లో సైతం అనుభవం లేని కొత్తవారిని తీసుకోవడం ద్వారా ఖర్చు తగ్గించుకోవాలని గూగుల్ భావించింది.