- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Gold: ఆగని బంగారం పరుగు.. రూ. 92 వేలకు అడుగు దూరం

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే కొత్త రికార్డులకు చేరిన పసిడి ధరలు, రోజురోజుకు సామాన్యులు కొనాలంటే భయపడే స్థాయికి చేరింది. బుధవారం సైతం అధిక డిమాండ్ కారణంగా తులం రూ. 92 వేలకు చేరువైంది. పెళ్లిళ్ల సీజన్‌కు ముందు ఆభరణాల వ్యాపారుల నుంచి పెరిగిన డిమాండ్ కారణంగా దేశ రాజధానిలో బంగారం పది గ్రాములు రూ. 700 వరకు పెరిగి రూ. 91,950కి చేరుకుంది. డిమాండ్‌కు తోడు మద్యప్రాచ్యంలో మరోసారి పెరిగిన ఉద్రిక్త పరిస్థితులు, అమెరికాలో ఆర్థిక మందగమనం, ట్రంప్ ఆర్థిక విధానాలతో పెరిగిన వాణిజ్య యుద్ధ భయాల కారణంగా పెట్టుబడిదారులు సురక్షితమైన సాధనాల్లో పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా అంతర్జాతీయంగా కూడా బంగారానికి డిమాండ్ ఊపందుకుంది. హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ. 91,500గా ఉంది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ. 82,900గా ఉంది. గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధర ఔన్స్ 3,039 డాలర్లుగా ఉంది. వెండి ధర కూడా రూ.1,000 పెరిగి రికార్డు స్థాయిలో రూ.1,14,000కి చేరుకుంది.