వామ్మో.. ఏంటీ అరాచకం.. రూ.90 వేలకు చేరువలో బంగారం ధర

by Gantepaka Srikanth |   ( Updated:2025-03-16 05:50:45.0  )
వామ్మో.. ఏంటీ అరాచకం.. రూ.90 వేలకు చేరువలో బంగారం ధర
X

దిశ, వెబ్‌డెస్క్: సామాన్యులకు బంగారం ధరలు(Gold Prices) కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతేడాది చివర్లో స్థిరంగా ఉన్న ధరలు.. సరిగ్గా పెళ్లిళ్ల సీజన్(Wedding Season) ప్రారంభం కాగానే జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాయి. తాజాగా మరోసారి బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల(22 Karat) 10 గ్రాముల ధర రూ.82,300 ఉండగా, అదే 24 క్యారెట్ల( 24 Karat) ధర రూ.89,780 వద్ద కొనసాగుతోంది. అంటే దాదాపు రూ.90 వేలకు చేరువలో ఉంది. రానున్న రోజుల్లో లక్ష రూపాయలు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెల చివర్లో దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కిలో వెండి ధర(Silver Price) కిలో ఏకంగా రూ.1,03,000కు చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,350 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.89,820 వద్ద కొనసాగుతుంది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం బంగారంపై పెట్టుబడి పెట్టడమే మంచి మార్గమని.. కొందరు భావిస్తున్నారు. మరికొందరు దీనిని వ్యతిరేకిస్తున్నారు. బంగారం ఎల్లప్పుడూ ఒకే రీతిలో ఉండబోదని.. బంగారంపై పెట్టుబడి పెట్టడం పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Read More..

Gold Gift: బరువు తగ్గితే బంగారం ఇస్తారా! ఎక్కడంటే?

Next Story