Jewellery Exports: 23 శాతం తగ్గిన రత్నాభరణాల ఎగుమతులు

by S Gopi |
Jewellery Exports: 23 శాతం తగ్గిన రత్నాభరణాల ఎగుమతులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల కారణంగా డిమాండ్ క్షీణించడంతో రత్నాభరణాల ఎగుమతులు గణనీయంగా తగ్గాయి. రత్నాభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి(జీజేఈపీసీ) తాజా గణాంకాల ప్రకారం.. జూలై నెలలో రత్నాభరణాల ఎగుమతులు 23.28 శాతం క్షీణించి 1,665.4 మిలియన్ డాలర్ల(రూ. 13.92 వేల కోట్లు)కు పడిపోయాయని జీజేఈపీసీ పేర్కొంది. గతేడాది ఇదే నెలలో రత్నాభరణాల ఎగుమతుల విలువ 2,170.71 మిలియన్ డాలర్లు(రూ. 18.20 వేల కోట్లు)గా నమోదయ్యాయి. అమెరికా, చైనా లాంటి కీలక మార్కెట్లలో భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా డిమాండ్ దెబ్బతిన్నది. ముఖ్యంగా చైనా ఆర్థికవ్యవస్థ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనడంతో డిమాండ్ ఎక్కువ ప్రభావితమైందని జీజేఈపీసీ ఛైర్మన్ విపుల్ షా చెప్పారు. జూలైలో కట్, పాలిష్ వజ్రాల ఎగుమతులు 22.71 శాతం క్షీణించి రూ. 7,615 కోట్లకు, బంగారు ఆభరణాల ఎగుమతులు 12.06 శాతం తగ్గి రూ. 4,450 కోట్లకు చేరాయి.

Advertisement

Next Story

Most Viewed