చివరి దశకు చేరుకున్న భారత, యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం!

by srinivas |
చివరి దశకు చేరుకున్న భారత, యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం!
X

ముంబై: భారత్, యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు చివరి దశలో ఉన్నాయని, కొన్ని విషయాల్లో స్పష్టత వచ్చిన అనంతరం దీపావళి సమయానికి డ్రాఫ్ట్ సిద్ధమవుతుందని లండన్ లార్డ్ మేయర్ విన్సెంట్ కివెని అన్నారు. గతవారం ముంబైలో జరిగిన ఫిన్‌టెక్ సమావేశంలో పాల్గొన్న ఆయన, భారత్ నుంచి తిరిగి యూకే చేరుకున్న తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇరు దేశాల్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఆఖరి దశలో ఉన్న తరుణంలో భారత పర్యటన సంతోషంగా ఉందన్నారు.

దీపావళి నాటికి ఒప్పందంపై సంతకం చేయాలని భావిస్తున్నట్టు భారత ప్రధాని మోదీ చెప్పారని, ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయితే రెండు దేశాల్ మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయాని ఆయన వివరించారు. కొన్ని పరిష్కారం కావాల్సిన అంశాలు ఉన్నాయి. ఇవి వీలైనంత త్వరగా పరిష్కారమవుతాయని ఇరు దేశాల మధ్య ఆశాభావం వ్యక్తమవుతోంది. ఏదేమైనప్పటికీ రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు సానుకూలంగా ఉండనున్నాయన్నారు. భారత్‌లో జరిగిన ఫిన్‌టెక్ సమావేశంలో పాల్గొన్న విన్సెంట్ కెవిని ఆర్‌బీఐతో పాటు సెబీకి సంబంధించిన ఉన్నతాధికారులు, పలువురు వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు.

Advertisement

Next Story

Most Viewed