ఈక్విటీ మార్కెట్లలో నెమ్మదిస్తున్న విదేశీ పెట్టుబడులు!

by Vinod kumar |
ఈక్విటీ మార్కెట్లలో నెమ్మదిస్తున్న విదేశీ పెట్టుబడులు!
X

ముంబై: భారత ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు నెమ్మదిస్తున్నాయి. అంతకుముందు వరుస మూడు నెలల్లో గణనీయమైన పెట్టుబడులు పెట్టిన విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు(ఎఫ్‌పీఐ) ఆగష్టులో జాగ్రత్త వహించాయి. వరుస నెలల్లో నిధులు ఇన్వెస్ట్ చేసిన తర్వాత అధిక ముడు చమురు ధరలు, ద్రవ్యోల్బణ ప్రభావం కారణంగా ప్రస్తుత నెలలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు రూ. 10,689 కోట్ల విలువైన షేర్లను మాత్రమే కొనుగోలు చేశారు. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, పెరుగుతున్న అమెరికా బాండ్ల రాబడి కారణంగా ఎఫ్‌పీఐలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.

డిపాజిటరీ గణాంకాల ప్రకారం.. ఈ నెలలో వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో గణనీయంగా ఐపీఓలు, బల్క్ డీల్స్ ద్వారా వచ్చినవే కావడం గమనార్హం. ఈక్విటీలు కాకుండా డెట్ మార్కెట్‌లో ఎఫ్‌పీఐలు రూ.5,950 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఈక్విటీ మార్కెట్లలో వచ్చిన ఎఫ్‌పీఐల మొత్తం పెట్టుబడి రూ.1.37 లక్షల కోట్లకు చేరగా, డెట్‌ మార్కెట్‌లో రూ.26,400 కోట్లుగా నమోదయ్యాయి. ఈ పెట్టుబడులు ఎక్కువగా కేపిటల్ గూడ్స్ రంగంలో ఉండగా, ఫైనాన్స్ రంగంలో అమ్మకాలు పెరుగుతున్నాయని గణాంకాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Next Story

Most Viewed