Forex Reserves: మళ్లీ తగ్గుముఖం పట్టిన భారత ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు..!

by Maddikunta Saikiran |
Forex Reserves: మళ్లీ తగ్గుముఖం పట్టిన భారత ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత విదేశీ మారక(Forex Reserves) నిల్వలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. డిసెంబర్ ఆరో తేదీతో ముగిసిన వారంలో 3.235 బిలియన్ డాలర్లు మేర తగ్గడంతో ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 654.857 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంక్ ఇండియా(RBI) శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అంతకముందు వారం(నవంబర్ 29) ఫారెక్స్ నిల్వలు 1.51 బిలియన్ డాలర్లు పెరిగి 658.091 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.

సెప్టెంబర్ చివర్లో ఫారెక్స్ నిల్వలు 704.885 బిలియన్ డాలర్ల ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత నుంచి క్రమంగా తగ్గుతూ రాగా నవంబర్ చివర్లో స్వల్పంగా పెరిగాయి. ఇక గోల్డ్ రిజర్వు(Gold Reserves) నిల్వలు 43 మిలియన్ డాలర్లు పతనమై 66.936 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మరోవైపు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్(SDR) 25 మిలియన్ డాలర్లు క్షీణించి 18.031 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయి. ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF)లో భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు మాత్రం 12 మిలియన్ డాలర్ల వృద్ధితో 4.266 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed