ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త డీల్: రూ. 20 వేలకే iPhone 13

by Harish |   ( Updated:2023-07-12 13:05:07.0  )
ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త డీల్: రూ. 20 వేలకే iPhone 13
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ యాపిల్ ఫోన్లపై ఇటీవల కాలంలో భారీ తగ్గింపులను అందిస్తుంది. తాజాగా Apple iPhone 13 ను భారీ డిస్కౌంట్‌తో వినియోగదారులు సొంతం చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 13 అసలు ధర రూ.69,900 కాగా, ఇప్పుడు ఈ ఫోన్‌పై 12 శాతం తగ్గింపును కంపెనీ ఆఫర్ చేస్తుంది. దీంతో ఫోన్ ధర రూ. 60,999కు తగ్గింది. అంటే రూ.8,901 ఫ్లాట్ తగ్గింపుతో అందుబాటులో ఉంది. దీంతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కూడా ఉంది. పాత ఫోన్‌ను మార్చుకున్నట్లయితే ఫ్లాట్ రూ. 38,600 వరకు తగ్గింపు వస్తుంది. అంతేకాకుండా కొనుగోలు సమయంలో HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 2000 తగ్గింపు కూడా ఉంది. అన్ని ఆఫర్లను వాడుకున్నట్లయితే iPhone 13 ను రూ.20 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది.


iPhone 13 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లేను కలిగి ఉంది. ఫ్లాగ్‌షిప్ A15 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. ఫోన్ బ్యాక్ సైడ్ 12MP + 12MP కెమెరాలు ఉన్నాయి. ముందు సెల్ఫీలకోసం 12MP కెమెరా ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో 4కె డాల్బీ విజన్ హెచ్‌డిఆర్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంది.

Advertisement

Next Story

Most Viewed