- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
1,500 మంది ఉద్యోగులను తొలగిస్తున్న ఫ్లిప్‌కార్ట్
దిశ, బిజినెస్ బ్యూరో: వ్యయ నియంత్రణలో భాగంగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ 5-7 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్టు సమాచారం. పనితీరు ఆధారంగా ఈ తొలగింపులు ఉంటాయని, ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ నాటికి ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది. గతేడాది కంపెనీ ఎలాంటి నియామకాలను చేపట్టకపోగా, 2024లో తొలగింపుల నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గడిచిన రెండేళ్ల నుంచి ఫ్లిప్‌కార్ట్ పనితీరు ఆధారంగా ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ 22,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. తాజా తొలగింపుల నిర్ణయంతో 1,100-1,500 మందిపై ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే, ఈ ఏడాదికి సంబంధించి కంపెనీ రోడ్‌మ్యాప్, పునర్నిర్మాణం గురించి వచ్చే నెలలో జరిగే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని, లేఆఫ్స్ ప్రక్రియ ఉన్నప్పటికీ, 2024లో ఫ్లిప్‌కార్ట్ ఐపీఓకు ఎలాంటి ఆలస్యం ఉండదని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.