ప్రభుత్వానికి రికార్డు మొత్తం డివిడెండ్ ఇచ్చిన ఎస్‌బీఐ

by S Gopi |
ప్రభుత్వానికి రికార్డు మొత్తం డివిడెండ్ ఇచ్చిన ఎస్‌బీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారీ డివిడెండ్ ఆదాయాన్ని ప్రభుత్వానికి అందజేసింది. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రూ. 6,959.29 కోట్ల చెక్కును ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ కుమారు ఖారా అందించారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ప్రభుత్వానికి రూ. 5,740 కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది. దీంతో గత ఆర్థిక సంవత్సరం చెల్లించిన మొత్తమే ఇప్పటివరకు అత్యధికం కావడం విశేషం. ఇక, ఎస్‌బీఐతో పాటు ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ. 857.16 కోట్ల డివిడెండ్ చెల్లింపును ఆర్థిక మంత్రికి అందించారు.

Advertisement

Next Story

Most Viewed