Tatamotors: కార్లపై టాటా మోటార్స్ రూ. 2.05 లక్షల వరకు పండుగ సీజన్ డిస్కౌంట్

by S Gopi |
Tatamotors: కార్లపై టాటా మోటార్స్ రూ. 2.05 లక్షల వరకు పండుగ సీజన్ డిస్కౌంట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఈ ఏడాది పండుగ సీజన్ కోసం వినియోగదారులకు భారీ ఆఫర్లను ప్రకటించింది. 'ఫెస్టివల్ ఆఫ్ కార్స్ ' పేరున భారీ డిస్కౌంట్లతో పాటు అనేక ప్రయోజనాలను అందిస్తున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్లు పరిమిత కాలానికి పండుగ సీజన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. అక్టోబర్ 31 వరకు కస్టమర్లు అదనపు ప్రయోజనాలతో పాటు రూ. 2.05 లక్షల వరకు రాయితీని పొందవచ్చు. ఈ ఆఫర్లు పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ వాహనాలపై భారీ తగ్గింపుతో వర్తిస్తాయి. వాటిలో టాటా టియాగోపై రూ. 65,000 వరకు డిస్కౌంటున్ ఉంటుంది. అలాగే, టిగోర్ మోడల్‌పై రూ. 30,000 వరకు, ఆల్ట్రోజ్ కారుపై రూ. 45,000, నెక్సాన్ రూ. 80,000 డిస్కౌంటున్ లభిస్తుంది. ఇక ఎస్‌యూవీ మోడళ్లు హారియర్‌పై రూ. 1.6 లక్షల వరకు, సఫారీపై రూ. 1.8 లక్షల వరకు డిస్కౌంట్ అమలవుతుంది. సీఎన్‌జీ మోడళ్లపై రూ. 2.05 లక్షల వరకు డిస్కౌంట్లు వర్తిస్తాయని కంపెనీ పేర్కొంది.

Advertisement

Next Story