ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంచిన Federal Bank !

by Harish |   ( Updated:2022-12-19 11:10:03.0  )
ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంచిన Federal Bank !
X

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ నెల 18వ తేదీ నుంచి రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్లు అమలవుతాయని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. బ్యాంకు వివరాల ప్రకారం, గరిష్టంగా 18 నెలల నుంచి రెండేళ్ల కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై 7.25 శాతం వడ్డీ లభిస్తుంది. ఇదే కాలపరిమితి డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ అందుతుంది.

అలాగే, 91-119 రోజుల డిపాజిట్లపై 4.50 శాతం, 120-180 రోజులకు 4.75 శాతం, 2-3 ఏళ్ల కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీలకు 6.75 శాతం, 3-5 ఏళ్లకు 6.50 శాతం వడ్డీ అందుబాటులో ఉంటుందని బ్యాంకు వివరించింది. వినియోగదారుల భద్రత, లిక్విడిటీ, రిటర్న్‌లకు ప్రాధాన్యత ఇస్తూ మెరుగైన రాబడిని ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని ఫెడరల్ బ్యాంక్ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed