- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Elon Musk: వేతన ప్యాకేజీ విషయంలో మస్క్ కు మరోసారి షాక్
దిశ, బిజినెస్: బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు(Tesla CEO Elon Musk) వేతన ప్యాకేజీ విషయంలో మరోసారి షాక్ తగిలింది. ఆయనకు 55.8 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) ప్యాకేజీని తిరస్కరిస్తూ గతంలో ఇచ్చిన తీర్పును డెలావేర్ కోర్టు మరోసారి సమర్థించుకుంది. వాటాదారుల ఓట్ల ద్వారా డీల్‌ను ముందుకుతీసుకెళ్లాలని టెస్లా (Tesla) చేసిన ప్రయత్నాన్ని కోర్టు ఆమోదించలేదు. మస్క్ (Elon Musk Pay Package) ప్యాకేజీ అధికం. అంత ప్యాకేజీ ఇస్తే వాటాదారులకు అన్యాయం చేసినట్లేనని కోర్టు మరోసారి అభిప్రాయం వ్యక్తంచేసింది. అంతేకాదు, దీనిపై మస్క్‌కు 345 మిలియన్ డాలర్ల అటార్నీ ఫీజులను విధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ తీర్పుపై టెస్లా అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై అప్పీల్ కు వెళ్తామని ప్రకటించింది. " కంపెనీ ఓట్లను షేర్‌హోల్డర్లు నియంత్రించాలి. న్యాయమూర్తులు కాదు" అని మస్క్ ప్రత్యేక పోస్ట్‌లో పేర్కొన్నారు.
మస్క్ ప్యాకేజీ వివాదం
ఎలాన్ మస్క్ (Elon Musk) 2018లో అన్నిరకాల ప్రయోజనాలు కలిపి 55.8 బిలియన్ డాలర్ల వార్షిక వేతనం అందుకున్నారు. కార్పొరేట్ చరిత్రలో ఇదే అత్యధిక పారితోషికం. దీంతో ఆయన బిలియనీర్ గా మారారు. అయితే, మస్క్‌కు అధికంగా చెల్లించారంటూ వాటాదారుల్లో ఒకరైన రిచర్డ్ టోర్నెట్టా.. డెలావేర్ కోర్టును ఆశ్రయించారు. ఇంత వేతనం ఇవ్వడం కార్పొరేట్ ఆస్తులను వృథా చేయడమే అవుతుందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తనకు నచ్చిన ప్యాకేజీకి ఆమోదించాలని ఆదేశిస్తున్నారని పిటిషన లో పేర్కొన్నారు. గతంలో దీనిపై విచారణ జరిపిన డెలవేర్ కోర్టు.. మస్క్ వేతన ప్యాకేజీని నిర్ణయించడంలో తప్పు జరిగిందని తేల్చింది. ఆ భారీ వేతనాన్ని వదులుకోవాలంటూ ఈ ఏడాది జనవరిలో తీర్పు వెలువరించింది. అయితే, కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఈ ఏడాది జూన్‌లో టెస్లా వార్షిక సమావేశంలో ప్యాకేజీపై నిర్ణయం తీసుకున్నారు. వాటాదారులకు ఓటింగ్ నిర్వహించి మస్క్‌కు 55.8 బిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీని మళ్లీ ఆమోదించారు. ఈ ఓటింగ్‌ను పరిగణనలోకి తీసుకొని ప్యాకేజీపై తీర్పును సవరించాలని కోరుతూ మస్క్ మరోసారి డెలావేర్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు మస్క్ పిటిషన్ ను న్యాయస్థానం ఈ పిటిషన్‌ను కొట్టివేసి.. పాత తీర్పునే సమర్థించింది