- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మస్క్‌కు భారీ షాక్: 2 నెలల్లో రూ.3 లక్షల కోట్లు ఆవిరి
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ ధనవంతుల్లో ఎలాన్ మస్క్ మూడో స్థానానికి పడిపోయారు. ఆయన ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.3 లక్షల కోట్లకు(40 బిలియన్ డాలర్లు) పైగా సంపదను కోల్పోయినట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. నివేదిక ప్రకారం మస్క్ నికర సంపద 189 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ప్రపంచ ధనవంతుల్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్త లూయిస్ విట్టన్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ 201 బిలియన్ డాలర్ల నికర సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు.
ఆ తర్వాత అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 198 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉండగా, మస్క్ తర్వాత జూకర్ బర్గ్ 182 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో నిలిచారు. మస్క్ సంపద క్షీణించడానికి ప్రధానం కారణం టెస్లా షేర్లు రాణించకపోవడమే. మస్క్ టెస్లాలో 21 శాతం వాటాను కలిగి ఉన్నాడు. గత కొంత కాలంగా ఆ కంపెనీ షేర్లు గణనీయంగా పడిపోతున్నాయి. టెస్లా ఈ సంవత్సరం ఇప్పటివరకు దాని నికర విలువలో 29 శాతం పైగా పడిపోయింది. అలాగే, కంపెనీకి అతి ముఖ్యమైన మార్కెట్ అయినటువంటి చైనాలో అమ్మకాలు తగ్గడం మస్క్‌కు కలిసిరాలేదు.
దీంతో పాటు బెర్లిన్ సమీపంలోని టెస్లా ఫ్యాక్టరీపై దాడి జరగడంతో అక్కడ ఉత్పత్తిని నిలిపివేశారు. ఇది దాని షేర్ ధరలను ప్రభావితం చేసింది. టెస్లా షేరు 2021 గరిష్ట స్థాయి నుండి 50 శాతానికి తగ్గింది. అలాగే, మస్క్‌కి ఇటీవల 55 బిలియన్ డాలర్ల ప్యాకేజీని కొట్టివేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో ఆయన సంపద క్షీణించింది.
భారత్ విషయానికి వస్తే, బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం ముఖేష్ అంబానీ 113 బిలియన్ డాలర్లతో జాబితాలో 11వ స్థానంలో ఉండగా, గౌతమ్ అదానీ 103 బిలియన్ డాలర్లతో 13 స్థానంలో ఉన్నారు.