- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ట్విట్టర్ సీఈఓగా కుక్క.. నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్న మస్క్
దిశ, వెబ్‌డెస్క్: సంచనాలకు కేరాఫ్‌గా మారిన ఎలాన్ మస్క్, తాను ఎలాంటి నిర్ణయం తీసుకున్న అది అందరికీ షాకింగ్‌గానే ఉంటుంది. ట్విట్టర్‌ను తాను చేజిక్కించుకున్న తరువాత అతను తీసుకునే నిర్ణయాలు ప్రజలను విశ్మయాలకు గురిచేస్తున్నాయి. ఇటీవల ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు తీసుకున్న తరువాత ఆ స్థానంలో వేరొకరిని("ఎవరైనా మూర్ఖుడు") నియామిస్తానని ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఇప్పుడు మస్క్ తీసుకున్న నిర్ణయం అందరిని షాకింగ్‌కి గురిచేస్తుంది. ఎందుకంటే 'ట్విట్టర్ సీఈవోగా తన స్థానంలో కుక్కను నియమించుకున్నట్లు ఎలోన్ మస్క్' బుధవారం తెలిపారు.
దీనికి సంబంధించిన విషయాన్నిమస్క్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తన పెంపుడు కుక్క 'ఫ్లోకి' సీఈవో అని రాసి ఉన్న టీ షర్ట్ వేసి సీఈవో స్థానంలో కూర్చోబెట్టి కొత్త సీఈవో ఇతనే అంటూ పోస్ట్ చేశారు. అంతేకాకుండా పాత సీఈవోల కన్నా ఇదే బెటర్ అంటూ భారత్‌కు చెందిన మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్‌ను ఉద్దేశిస్తూ విమర్మించారు.
ఇప్పుడు దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ ట్వీట్ నెటిజన్లను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. ముందు ట్విట్టర్ పని తీరుపై శ్రద్ధ వహించండి, అంతేగాని పాత సీఈవో గురించి కాదని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతూ మస్క్‌పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.