- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రూ. 5-10 తగ్గనున్న వంటనూనె ధరలు!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వంటనూనె ధరలు మరింత దిగిరానున్నాయి. ఈ మేరకు కేంద్రం వంటనూనె తయారీ కంపెనీలకు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి కంపెనీలు సైతం సుముఖత వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో కమొడిటీ ఆయిల్ రేట్లు గణనీయంగా తగ్గడంతో దేశీయంగా కూడా గరిష్ట రిటైల్ ధర(ఎంఆర్‌పీ)ని తగ్గించాలని కంపెనీలకు ప్రభుత్వం తెలిపింది. దాన్ని అంగీకరించిన కంపెనీలు వంటనూనె ధరలను దాదాపు 6 శాతం వరకు తగ్గించడానికి అంగీకరించాయి. అంటే, లీటర్ వంటనునె ధర సుమారు రూ. 5-10 మధ్య తగ్గనుంది.
దాంతో ఫార్చ్యూన్ బ్రాండ్ పేరుతో వంటనూనె విక్రయించే అదానీ విల్మార్ రూ. 5, జెమినీ బ్రాండ్ విక్రయించే జెమినీ ఎడిబుల్ అండ్ ఫ్యాట్స్ ఇండియా రూ. 10 వరకు ధరలను తగ్గించనున్నాయి. ప్రధాన బ్రాండ్ల నిర్ణయంతో మార్కెట్లోని సన్‌ఫ్లవర్, పామాయిల్‌తో పాటు అన్ని రకాల వంటనూనె రేట్లు తగ్గనున్నాయి. ధరల తగ్గింపు ప్రయోజనాలు వినియోగదారులకు మరో మూడు వారాల్లో అందుబాటులో ఉంటాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
Also Read...