- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Vivo మనీలాండరింగ్ కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన ఈడీ!
న్యూఢిల్లీ: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వీవో మనీలాండరింగ్ కేసులో ఈడీ లావా ఇంటర్నేషనల్ ఎండీ హరి ఓం రాయ్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసింది. వారిలో చైనాకు చెందిన వ్యక్తి ఒకరు, చార్టర్డ్ అకౌంటెంట్, మరొకరు ఉన్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద వీరిని అదుపులోకి తీసుకోగా, కోర్టు ముందు హాజరుపరిచాక కస్టడీకి కోరే అవకాశం ఉంది.
అయితే, వీవో కంపెనీ వ్యవహారంలో లావా ఎండీని అరెస్ట్ చేసిన కారణం గురించి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. వీఓపై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. గతేడాది జులైలో దేశీయంగా ఉన్న వీవోతో పాటు అనుబంధ కంపెనీల సంస్థల్లో ఈడీ సోదాలు చేపట్టింది.
వీవో కంపెనీ సాధిస్తున్న నిధుల్లో దాదాపు రూ. 62.5 వేల కోట్లను చైనాకు తరలించినట్టు ఈడీ కనిపెట్టింది. ఈ విధంగా భారత్‌లో పెద్ద ఎత్తున పన్ను ఎగవేతకు వీవో పాల్పడింది. దీన్ని అరికట్టేందుకు కంపెనీకి చెందిన బ్యాంకు అకౌంట్ల వినియోగాన్ని నిలిపేసిన 15 నెలల తర్వాత ఈ వ్యవహారంలో అరెస్టులు జరిగాయి.