- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ ఏడాది దేశంలోని మొత్తం స్కూటర్ల అమ్మకాల్లో 5 శాతం ఈవీలదే: గ్రీవ్స్ ఎలక్ట్రిక్!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ మొత్తం స్కూటర్ మార్కెట్లో ఈ-స్కూటర్ల వాటా 5 శాతానికి చేరుకుంటుందని ప్రముఖ యాంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించే గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అభిప్రాయపడింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 2 శాతంగా ఉందని కంపెనీ తెలిపింది. 2022-23లో పరిశ్రమ మొత్తం 7 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు సాధిస్తుందనే అంచనాలున్నాయని, ఇది గతేడాది కంటే 180 శాతం వృద్ధి కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) పట్ల వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని కంపెనీ అభిప్రాయపడింది.
ఇదే స్థాయిలో అమ్మకాలు కొనసాగితే 2027 నాటికి 30-35 శాతం ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్(ఐసీఈ) స్కూటర్లు ఎలక్ట్రిక్ స్కూటర్లకు మారతాయని కంపెనీ అంచనా వేసింది. ప్రస్తుతం దేశంలోని మొత్తం ఈవీల అమ్మకాల్లో యాంపియర్ 14-15 శాతం వాటా కలిగి ఉంది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 65 వేల ఈవీలను విక్రయించగా, ప్రస్తుతం 2022-23 మొదటి త్రైమాసికంలోనే 29,577 యూనిట్లను విక్రయించింది. దీంతో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 25 వేల యూనిట్లకు రెట్టింపు చేయాలని కంపెనీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది ప్రథమార్థంలో దేశంలోని పలు చోట్ల ఈవీలు అగ్ని ప్రమాదానికి గురైన సంఘటనల వల్ల అమ్మకాలు కొంత మందిగించినప్పటికీ, గత రెండు మూడు త్రైమాసికాల్లో ఎదురైన చిప్‌ల కొరత తీరిందని, రానున్న నెలల్లో విక్రయాలు మరింత వేగవంతంగా ఉంటాయని కంపెనీ వెల్లడించింది.