మరిన్ని నగరాలకు ఈ-రూపీ విస్తరణ!

by Harish |   ( Updated:2023-02-08 14:59:31.0  )
మరిన్ని నగరాలకు ఈ-రూపీ విస్తరణ!
X

ముంబై: డిజిటల్ కరెన్సీకి సంబంధించి ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన ఈ- రూపీ వినియోగాన్ని మరింత విస్తరించనున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. బుధవారం ఎంపీసీ సమావేశం అనంతరం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి రవిశంకర్ మాట్లాడుతూ.. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీగా వచ్చిన ఈ-రూపీ రిటైల్ వినియోగాన్ని మరో ఐదు బ్యాంకులు, 9 నగరాలలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ-రూపీ సేవలను 50 వేల మంది ప్రజలతో పాటు, ఐదు వేల మంది వ్యాపారులు వాడుతున్నారు. గతేడాది నవంబర్ 1 నుంచి హోల్ సెల్ అవసరాలకు, డిసెంబర్ 1 నుంచి రిటైల్ అవసరాలకు ఆర్బీఐ డిజిటల్ కరెన్సీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదటి దశలో ఐదు నగరాలు, 8 నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి.

ఈ-రూపీ వాడకానికి సంబంధించి ఆర్బీఐ హడావుడిగా కాకుండా సమస్యలు ఉత్పన్నమవకుండా నెమ్మదిగా వెళ్లాలని భావిస్తోందని రవిశంకర్ తెలిపారు. కాగా, మొదటి దశలో ఈ-రూపీ వినియోగాన్ని ఎస్‌బీఐ, యెస్ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్, అనంతరం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, కోటక్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంకులు భాగస్వామ్యం అయ్యాయి.

Also Read..

15 శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న 'zoom'!

Advertisement

Next Story

Most Viewed