డిస్నీ ఇండియా కొనుగోలు రేసులో గౌతమ్ అదానీ!

by Harish |   ( Updated:2023-10-06 10:52:23.0  )
డిస్నీ ఇండియా కొనుగోలు రేసులో గౌతమ్ అదానీ!
X

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ దిగ్గజం వాల్ట్‌ డిస్నీ తన భారత వ్యాపారం డిస్నీ ఇండియా విక్రయించాలని చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా డిస్నీ ఇండియా స్ట్రీమింగ్, టెలివిజన్ వ్యాపారాన్ని దేశీయ బిలియనీర్ గౌతమ్ అదానీ, సన్‌టీవీ నెట్‌వర్క్‌లకు విక్రయించడానికి చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అలాగే, డిస్నీకి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ప్రైవేట్ ఈక్విటీ ఫండ్‌ల ఆసక్తిని కూడా పరిశీలిస్తున్నట్టు సంబంధిత వ్యక్తులు తెలిపారు.

కంపెనీ వివిధ రకాల అవకాశాలను అన్వేషిస్తోంది. సరైన కొనుగోలుదారు దొరికితే భారత కార్యకలాపాల్లో కొంత భాగాన్ని విక్రయించడం లేదంటే క్రీడా హక్కులు, ప్రాంతీయ స్ట్రీమింగ్ సర్వీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ హక్కులను విక్రయించవచ్చని తెలుస్తోంది. ఇదివరకే ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌తో కూడా విక్రయం కోసం చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

ఐపీఎల్‌కు సంబంధించిన స్ట్రీమింగ్‌ హక్కులను డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ కోల్పోయిన సంగతి తెలిసిందే. రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌ 18 ఈ హక్కులను దక్కించుకుంది. అప్పటి నుంచి డిస్నీ హాట్‌స్టార్‌కు సబ్‌స్క్రైబర్లు తగ్గుతున్నారు. ఈ క్రమంలోనే డిస్నీ భారత్‌లో తన వ్యాపారాన్ని పూర్తిగా విక్రయించడం లేదా జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసే అంశాలను పరిశీలిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed