20 శాతం పెరిగిన నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు

by S Gopi |
20 శాతం పెరిగిన నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఇప్పటి వరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 19.88 శాతం పెరిగి రూ.18.90 లక్షల కోట్లను అధిగమించాయని ఆదాయపు పన్ను విభాగం మంగళవారం వెల్లడించింది. మార్చి 17 నాటికి మొత్తం రూ. 18,90,259 కోట్ల నికర ప్రత్యక్ష పన్ను వసూలు కాగా, ఇందులో కార్పొరేట్‌ ఆదాయపు పన్ను (సీఐటీ) రూ. 9,14,469 కోట్లు, సెక్యూరిటీల లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ)తో సహా వ్యక్తిగత ఆదాయపు పన్ను (పీఐటీ) రూ. 9,72,224 కోట్లుగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 17 వరకు దాదాపు రూ. 3.37 లక్షల కోట్ల రీఫండ్లు జారీ చేసినట్టు ఆదాయ పన్ను విభాగం పేర్కొంది. ప్రభుత్వం ప్రత్యక్ష పన్నుల వసూళ్లకు సంబంధించి సవరించిన అంచనాల్లో పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 19.45 లక్షల కోట్ల వసూళ్లను నిర్ణయించింది.

Advertisement

Next Story