- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు ప్రమోషన్లు ఉండవని ప్రకటించిన డెల్
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ టెక్ కంపెనీ డెల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు గట్టి షాక్ ఇచ్చింది. రిమోట్ పద్దతిలో పనిచేస్తున్న ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించవచ్చని, అయితే వారికి ఇకపై ప్రమోషన్లు ఉండవని స్పష్టం చేసింది. ఈ అంశం ఇప్పుడు టెక్ రంగంలో చర్చనీయాంసం అయింది. కరోనా మహమ్మారి కంటే ముందునుంచే డెల్ కంపెనీ హైబ్రిడ్ పని విధానాన్ని కొనసాగిస్తోంది. సుమారు 10-12 ఏళ్ల నుంచి ఈ వర్క్ మోడల్‌ను కంపెనీ నిర్వహిస్తోంది. కానీ, ప్రస్తుతం ఉద్యోగులందరూ విధిగా ఆఫీసులకు వచ్చే పనిచేయాలని నిబంధనలను కఠినతరం చేసింది. ఇటీవల డెల్ హైబ్రిడ్ ఉద్యోగులు వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసు నుంచి పనిచేయాలని మెమో జారీ చేసింది. రిమోట్ వర్క్ మోడల్ అనుసరించే వారికి ప్రమోషన్లు రవని, కంపెనీలో అంతర్గతంగా రోల్స్‌ను మార్చడానికి కుదరదని పేర్కొంది. డెల్ పనితీరును మాత్రమే పరిగణిస్తుందని, ప్రతి టీమ్‌లో 10-15 శాతం ఉద్యోగులు రిమోట్ వర్కర్లేనని ఓ ఉద్యోగి తెలిపారు. కానీ కంపెనీ తాజా నిబంధన కొంత ఆశ్చర్యానికి గురిచేసింది. కంపెనీ ఈ స్థాయిలో మార్పుల్ చేయడం పట్ల ఉద్యోగులు నిరాశకు గురయ్యారని ఆయన చెప్పారు. డెల్ అధినేత మైఖేల్ డెల్ సైతం వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ఎక్కువ సానుకూలంగా ఉండేవారు. ఇతర కంపెనీలు కూడా రిటర్న్ టూ ఆఫీస్ విషయంలో ఉద్యోగులను ఒత్తిడి చేయడం సరికాదని చెప్పేవారు. ఇప్పుడు ఈ వ్యవహారంలో యూటర్న్ తీసుకోవడం కొంత అసంతృప్తిగా ఉందని ఉద్యోగులు వెల్లడించారు.