75వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఏ2 దేశీ ఆవు పాలను విడుదల చేసిన సిద్స్‌ ఫార్మ్‌

by Harish |   ( Updated:2022-08-16 14:50:00.0  )
75వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఏ2 దేశీ ఆవు పాలను విడుదల చేసిన సిద్స్‌ ఫార్మ్‌
X

హైదరాబాద్‌: తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ప్రీమియం డీ2సీ డెయిరీ బ్రాండ్‌ సిద్స్‌ ఫార్మ్‌, భారతదేశపు 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఏ2 దేశీ ఆవుపాలను హైదరాబాద్‌లోని వినియోగదారుల కోసం విడుదల చేసింది. ఏ2 ఆవు పాల కు ఉన్న డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని కంపెనీ ప్రీ బుకింగ్‌ను అందుబాటులో ఉంచగా, కేవలం ఆరు గంటలలో 400కు పైగా వినియోగదారులు 350 లీటర్లకు పైగా పాలను బుక్‌ చేసుకున్నారు. సిద్స్‌ ఫార్మ్‌ ఈ దేశీ ఆవు పాలను 500 మిల్లీ లీటర్ల ప్యాక్‌ 75రూపాయల ధరలో విక్రయిస్తుంది.

ఏ2 పాలకు మరియు సాధారణ పాలకు ఉన్న ప్రధానమైన తేడా ఏమిటంటే, సాధారణ పాలలో ఏ1 బీటా కాసిన్‌ ఉంటే , ఏ2 పాలలో కేవలం ఏ2 బీటా కేసిన్‌ ఉంటుంది. ఆరోగ్య ప్రయోజనాల రీత్యా ఏ2 పాలను ఎక్కువ మంది అభిమానిస్తుంటారు.

సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌ డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ ''సిద్స్‌ ఫార్మ్‌ ఏ2 దేశీ ఆవు పాలను విడుదల చేయడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ప్రీమియం నాణ్యత, అత్యున్నత డిమాండ్‌ కలిగిన ఉత్పత్తిని పరిచయం చేసేందుకు ఇది అత్యుత్తమ సమయంగా మేము భావించాము. ధరలు మరియు నాణ్యత పరంగా భారతీయ సహజసిద్ధమైన పాల పరిశ్రమను మేము విప్లవాత్మీకరించాలనుకుంటున్నాము. ప్రతి భారతీయ వినియోగదారునికి కల్తీ లేని ఉత్పత్తులను ఎంచుకునే స్వేచ్ఛ సిద్ధించాలి. ఓ దేశంగా, ఉత్పత్తి పరంగా అంతర్జాతీయంగా అగ్రగామి దేశంగా మనం నిలిచాము కానీ నాణ్యత పరంగా కూడా మనం ఆ స్థానంలో నిలవాల్సిన అవసరం ఉంది. సిద్స్‌ ఫార్మ్‌ వద్ద మేము ఆ లక్ష్యం చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నాము''అని అన్నారు.

హైదరాబాద్‌లోని వినియోగదారులు సిద్స్‌ ఫార్మ్‌ యాప్‌ ద్వారా ఏ2 దేశీ ఆవు పాలను బుకింగ్‌ చేసుకోవచ్చు.

24 గంటలలో ఎప్పుడైనా ఇతర దేశాలకు మనీ ట్రాన్స్‌ఫర్

Advertisement

Next Story