Post Office Scheme: డబుల్ ఇంజిన్‌ స్కీమ్‌.. లక్షకు రెండు లక్షలు రిటర్న్స్‌.. ఈ పోస్టాఫీస్‌ పథకం గురించి తెలుసుకోండి!

by Vennela |
Post Office Scheme: డబుల్ ఇంజిన్‌ స్కీమ్‌.. లక్షకు రెండు లక్షలు రిటర్న్స్‌.. ఈ పోస్టాఫీస్‌ పథకం గురించి తెలుసుకోండి!
X

దిశ, వెబ్‌డెస్క్: Kisan Vikas Patra Calculator: చాలా మంది డబ్బు సంపాదిస్తున్నప్పటికీ దానిని సరైన విధంగా పొదుపు చేయలేక..మదుపు చేయలేక..మంచి రాబడిని కోల్పోతుంటారు. కొందరికి పెట్టుబడి పెట్టాలన్న ఆసక్తి ఉంటుంది. అయితే ఎక్కడ ఇన్వెస్ట్(Investment) చేయాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. ఇంకొందరు పెట్టుబడి పెడితే ఎక్కడ ఆ డబ్బులు వస్తాయో..పోతాయో అనే కంగారులో ఉంటుంటారు. ఇలాంటి వారి కోసం ఎలాంటి ఇబ్బందులు లేని స్కీములు కూడా మనకు చాలానే ఉన్నాయి. స్టాక్ మార్కెట్లు(Stock Market), మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds) వంటి వాటిల్లో పెట్టుబడులు అంటే రిస్క్ తో కూడుకున్నవే ఉంటాయి. కానీ కేంద్ర ప్రభుత్వం అందించే పోస్టాఫీస్ స్కీము(Post Office Scheme)లు చాలా మంచివని చెప్పుకోవచ్చు. వీటినే చిన్న మొత్తాల పొదుపు పథకాలు అంటుంటారు. వీటిల్లో ఎలాంటి రిస్క్ ఉండదు.

ఈ పోస్టాఫీస్ స్కీము(Post Office Scheme)ల్లో నిర్థిష్ట వడ్డీ రేటు ప్రకారం..నిర్ణీత కాల వ్యవధిలో రిటర్న్స్ వస్తుంటాయి. వీటిల్లో ఒక స్కీము కిసాన్ వికాస్ పత్ర(Kisan Vikas Patra Calculator). ఇక్కడ, కచ్చితంగా మీ ఇన్వెస్ట్ మెంట్(Investment) డబులు అవుతుంది. ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. దీంట్లో మీరు కనీసం రూ. 1000 నుంచి పెట్టుబడి పెట్టుకోవచ్చు. గరిష్టంగా ఎలాంటి లిమిట్ ఉండదు. అంటే ఎంతైనా మీ స్థోమతను బట్టి పెట్టుబడి పెట్టే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో ప్రస్తుతం 7.50శాతం వడ్డీ రేటు ఉంది.

కానీ దీని ప్రకారం సరిగ్గా 115నెలల్లో మీరు పెట్టిన పెట్టుబడి డబుల్ అవుతుంది. అంటే 9ఏళ్ల 7నెలలు పడుతుంది. ఇక్కడ ఎంతైనా అంటే ఉదాహరణకు మీరు లక్ష పెట్టుబడి పెడితే 115 నెలలకు రూ. 2లక్షలు వస్తాయి. ఇలాగే రూ. 5లక్షల పెడితే రూ. 10లక్షలు వస్తాయి. రూ. 20లక్షల జమ చేస్తే..115 నెలల్లో అది రూ. 40లక్షలు అవుతుంది. అందుకే ఈ స్కీమ్ మంచి డిమాండ్ ఉంటుంది. పోస్టాఫీస్(Post Office) లేదా గుర్తింపు పొందిన బ్యాంకుల్లో సింగిల్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు. లేదా గరిష్టంగా ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు.

మైనర్ పేరుతో గార్డియెన్ అకౌంట్ తీసుకోవచ్చు. ఈ పథకం కింద ఎన్ని అకౌంట్లు అయినా సరే తీసుకునే వీలుంటుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అకౌంట్ తెరిచిన రెండేళ్ల 6నెలల తర్వాత ఎప్పుడైనా ముందస్తు విత్ డ్రా చేసుకునే అవకాశం కూడా ఉటుంది. ఇక పోస్టాఫీస్ స్కీము(Post Office Scheme)ల్లో వడ్డీ రేట్లను కేంద్రం ప్రతి 3నెలలకోసారి సవరిస్తుంటుంది. ఇక్కడ వడ్డీ రేట్లు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు లేదంటే స్థిరంగా కూడా ఉండవచ్చు. వడ్డీ రేట్లు పెరిగితే రాబడి ఇంకొంచెం ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Next Story