- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Citroen సరికొత్త 'సీ5 ఎయిర్‌క్రాస్ ' ఎస్‌యూవీ మోడల్ లాంచ్
న్యూఢిల్లీ: దేశీయ వాహన పరిశ్రమలో ఇటీవల ఆదరణ పొందుతున్న ప్రముఖ ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రియెన్ తన సరికొత్త ఎస్‌యూవీ మోడల్ కారు సీ5 ఎయిర్‌క్రాస్‌ను గురువారం విడుదల చేసింది. దీని ప్రారంభ ధర ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌లో రూ. 36.67 లక్షలతో తీసుకొచ్చినట్టు ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రసుతం కంపెనీకి హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ, వైజాగ్ సహా 19 చోట్ల షోరూమ్‌లు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా పూర్తిగా వంద శాతం ఆన్‌లైన్ ద్వారా కొనుగోలుకు అవకాశం ఉందని తెలిపింది. సీ5 ఎయిర్‌క్రాస్ మోడల్ మొత్తం నాలుగు రంగుల్లో లభిస్తుందని, ఫేస్‌లిఫ్ట్ డిజైన్ కలిగిన ఈ కారులో అత్యాధునిక ఫీచర్లు అందిస్తున్నట్టు కంపెనీ వివరించింది.
ప్రధానంగా బ్రాండ్ లోగో, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టాండర్డ్ గేర్ లివర్ స్థానంలో కొత్త టోగుల్ స్విచ్ ఉన్నాయి. కారును కొనుగోలు చేసిన తర్వాత డెలివరీ తేదీ నుంచి 36 నెలలు లేదా లక్షల కిలోమీటర్ల వారంటీ ఉంటుంది. అలాగే, విడిభాగాలు, పరికరాలపై వారెంటీ, 24 గంటల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సదుపాయాలున్నాయి.
ఈ కారును కొన్న వినియోగదారులకు కంపెనీ సిట్రియెన్ ఫ్యూచర్ ష్యూర్ ప్యాకేజీ లభిస్తుందని, ఇందులో ఎక్స్‌టెండ్ వారంటీ, మెయింటెనెన్స్, ఆన్-రోడ్ ఫైనాన్స్, నిర్వహణ ప్యాకేజీ ఉంటుందని కంపెనీ వెల్లడించింది.