- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2024-25లో భారతదేశ జీడీపీ వృద్ధి 8 శాతం: CII
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుతుపవనాలు ఆశాజనకంగా ఉండటం వలన వ్యవసాయం రంగం మెరుగైన పనితీరు కనబరుస్తుందని, ప్రైవేట్ పెట్టుబడులు కూడా సానుకూలంగా ఉండటంతో 2024-25లో భారతదేశ జీడీపీ వృద్ధి 8 శాతంగా నమోదవుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) అధ్యక్షుడు, అలాగే ఐటీసీ ఛైర్మన్‌గా ఉన్న సంజీవ్ పురి అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రతికూల రుతుపవనాల కారణంగా వ్యవసాయ రంగం దెబ్బతింది, కానీ ఈ సారి అంచనాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. దేశం నుంచి ఎగుమతులు పెరిగే అవకాశం ఉందని అన్నారు.
సీఐఐ అంచనా ప్రకారం, ఎఫ్‌వై 24లో 1.4 శాతంగా ఉన్న వ్యవసాయ రంగ ఉత్పత్తి ఎఫ్‌వై25లో 3.7 శాతానికి పెరిగే అవకాశం ఉంది. పరిశ్రమ వృద్ధి రేటు 9.3 శాతం నుండి 8.4 శాతంగా ఉంటుందని, మార్చితో ముగిసిన సంవత్సరంలో 7.9 శాతంతో పోలిస్తే 9 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. భారతదేశ వృద్ధిలో ప్రధానంగా ప్రైవేట్ రంగ పెట్టుబడుల భాగస్వామ్యం, భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాలలో ప్రభుత్వ పెట్టుబడులు, మంచి పెట్టుబడిదారీ బ్యాంకింగ్ వ్యవస్థ, వృద్ధి చెందుతున్న క్యాపిటల్ మార్కెట్ వంటివి భారతదేశ వృద్ధిని మరింత పైకి తీసుకెళ్తున్నాయని పూరీ అన్నారు.
రాబోయే రోజుల్లో సిమెంట్, ఉక్కు వంటి మౌలిక సదుపాయాల ఆధారిత రంగాలు, ప్రభుత్వ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల నుంచి లబ్ధి పొందుతున్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తి, ఫుడ్ ప్రాసెసింగ్, టెలికాం వంటి రంగాలు, లాజిస్టిక్స్, పునరుత్పాదక ఇంధనం, ఆటోమొబైల్స్, సెమీ కండక్టర్లు ప్రైవేట్ పెట్టుబడి స్థాయిలలో మెరుగుదలని చూస్తామని తెలిపారు. పెట్టుబడి-వినియోగం జంట ఇంజిన్లు బాగా పనిచేస్తాయి. ప్రస్తుతం భారత్‌లో ఇది చక్కగా పనిచేస్తుంది. వ్యవసాయం రంగం కూడా సానుకూల వృద్ధిని చూసినట్లయితే భారత్ పెట్టుబడులకు మరింత ఆశాజనకంగా నిలుస్తుందని సీఐఐ అధ్యక్షుడు సంజీవ్ పురి అన్నారు. ఇదిలా ఉంటే గతవారం భారత జీడీపీ వృద్ధిరేటును ఆర్‌బీఐ 7.2 శాతంగా పేర్కొంది.