- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ద్రవ్యోల్బణ నియంత్రణకు చర్యలు: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!
జైపూర్: దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందని, రానున్న రోజుల్లో దానిపై మరింత దృష్టి సారిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సోమవారం జైపూర్‌లో జరిగిన బడ్జెట్ అనంతర సమావేశంలో పాల్గొన మంత్రి, కొన్ని వస్తువులపై దిగుమతి సుంకాన్ని తగ్గించడమే కాకుండా పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నామని, తద్వారా వస్తువుల ధరలు పెరగకుండా నియంత్రిస్తామని తెలిపారు.
స్థానిక లభ్యతను మెరుగుపరిచేందుకు కొన్ని పప్పుధాన్యాలపై దిగుమతి సుంకాన్ని కూడా తగ్గించాం. దీనివల్ల రాబోయే సీజన్‌లో పప్పుధాన్యాల ఉత్పత్తి పెరుగుతుంది. తాత్కాలిక కొరతను భర్తీ చేసేందుకు కంది, పెసర పప్పు ధాన్యాలపై దిగుమతి సుంకాన్ని సింగిల్ డిజిట్‌కు తగ్గించడం లేదా పూర్తిగా తొలగించామన్నారు.
ఇదే సమయంలో గత మూడేళ్లుగా వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని సున్నాగా కొనసాగిస్తున్నాం. దీంతో రిఫైన్‌డ్ పామాయిల్, ముడి పామాయిల్ అందుబాటులోకి వచ్చింది. దాంతో వంట నూనె సరఫరా మెరుగుపడింది. కాగా, ఈ ఏడాది జనవరిలో టోకు ద్రవ్యోల్బణం 2 ఏళ్ల కనిష్టం 4.73 శాతానికి పరిమితమైంది. రిటైల్ ద్రవ్యోల్బణం మాత్రమే మూడు నెలల గరిష్ఠం 6.52 శాతంగా ఉంది.