Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్, ప్రొడక్ట్ స్టాండర్డ్స్‌పై ప్రభుత్వం విచారణ

by S Gopi |
Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్, ప్రొడక్ట్ స్టాండర్డ్స్‌పై ప్రభుత్వం విచారణ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఓలా ఎలక్ట్రిక్‌పై ప్రభుత్వం విచారణ చేపట్టనుంది. కంపెనీపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పెరిగిన నేపథ్యంలో సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ) సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీసీపీఏ పరిశోధనాత్మక విభాగం డైరెక్టర్ జనరల్(డీజీ) ఇన్విస్టిగేషన్ చేపట్టాలని ఉత్తర్వులిచ్చింది. గత కొంతకాలం నుంచి వినియోగదారుల హక్కుల ఏజెన్సీకి రికార్డు స్థాయిలో 10,000 ఫిర్యాదులు వచ్చిన కారణంగానే ప్రభుత్వం విచారణకు సిద్ధమైంది. దీనిపై కంపెనీ నుంచి సీసీపీఏ వివరణ కోరింది. ఓలా నుంచి స్పందన వచ్చిన తర్వాత ఈ విషయంపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) సమగ్ర విచారణ జరపనున్నట్టు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరె చెప్పారు. ఓలా ఎలక్ట్రిక్ వచ్చిన 99.1 శాతం ఫిర్యాధులను పరిష్కరించడంలో సంతృప్తికరంగా లేవని ప్రభుత్వ అధికారులు ఇప్పటికే గుర్తించారు. మొత్తం ఫిర్యాదుల్లో 3,364 సర్వీస్, రిపేరింగ్ నెమ్మదిగా ఉందని, 1,899 ఫిర్యాదులు ఈవీ స్కూటర్ల డెలివరీ ఆలస్యమవుతున్నాయని వచ్చాయి.

Advertisement

Next Story

Most Viewed