క్యాష్ డిపాజిట్.. ఇక యూపీఐ ఉంటే చాలు

by M.Rajitha |
క్యాష్ డిపాజిట్.. ఇక యూపీఐ ఉంటే చాలు
X

దిశ, వెబ్ డెస్క్ : మన అకౌంట్లో గాని, ఇతరుల అకౌంట్లో గాని క్యాష్ డిపాజిట్ చేయాలంటే కార్డ్ గాని, అకౌంట్ నంబరు గాని తప్పనిసరి అని తెలిసిందే. అయితే ఇకనుండి అవేమీ అవసరం లేకుండా యూపీఐ తోనే మన బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. యూపీఐ ఇంటరాపరేబుల్ క్యాష్ డిపాజిట్ అని పిలిచే ఈ సేవల్ని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టీ రవిశంకర్ గురువారం ఆవిష్కరించారు. మొబైల్ నంబరుతో అనుసంధానం అయిన యూపీఐ, వర్చువల్ పేమెంట్ అడ్రస్, ఐఎఫ్ఎస్సీ కోడ్.. వీటిలో ఏదోక దానిని ఎంటర్ చేసి.. మన ఖాతాలో గాని, ఇతరుల ఖాతాలో గాని డబ్బులు జమ చేయవచ్చు.

ఎలా పనిచేస్తుందంటే..

* మొదట క్యాష్ డిపాజిట్ యంత్రం ఉన్న ఏటీఎంకు వెళ్ళి యూపీఐ క్యాష్ డిపాజిట్ ఎంచుకోవాలి.

*అపుడు ఆ యంత్రం స్క్రీన్ మీద ఓ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. దానిని యూపీఐ పేమెంట్ లోని స్కానర్ తో స్కాన్ చేయాలి.

*ఎంత అమౌంట్ అకౌంట్లో డిపాజిట్ చేయాలో అది ఫోన్లో ఎంచుకొని, కోరుకున్న బ్యాంక్ ను ఎన్నుకొని, పిన్ ఎంటర్ చేస్తే చాలు.

కాగా ఇది కార్డ్ లెస్ క్యాష్ డిపాజిట్ కు మరో రూపం అంటున్నారు విశ్లేషకులు.

Next Story

Most Viewed