- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Care Hospitals- Aster DM Ltd: కేర్ హాస్పిటల్స్, ఆస్టర్ డీఎం విలీనం.. మూడో అతిపెద్ద వైద్య సేవల సంస్థగా ఆవిర్భావం..!
దిశ, వెబ్‌డెస్క్: కార్పొరేట్ వైద్య సేవ సంస్థలైన కేర్ హాస్పిటల్స్(Care Hospitals), ఆస్టర్ డీఎం లిమిటెడ్(Aster DM Ltd) విలీనం కానున్నాయి. ఈ మేరకు పరస్పర అంగీకార ఒప్పందం కుదర్చుకున్నట్లు రెండు సంస్థలు ప్రకటించాయి. ఈ విలీనంతో దేశీయంగా మూడో అతిపెద్ద కార్పొరేట్ హాస్పిటల్ చెయిన్(Corporate Hospital Chain)గా ఆవిర్భవించనుంది. దీంతో దేశంలో ఈ సంస్థకు 27 నగరాల్లో 38 హాస్పిటల్స్, 10,150 బెడ్స్ ఉంటాయి. ఇక 2027 వరకు మరో 3,500 పడకలును పెంచుకునేందుకు ప్రణాళికలు రెడీ చేశాయి. ఈ రెండు హాస్పిటల్స్ విలీనంతో ఏర్పడే సంస్థను ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్ గా వ్యవరిస్తారు. విలీనం తర్వాత ఆస్టర్ డీఎం షేర్ హోల్డర్లకు 57.3 శాతం, కేర్ హాస్పిటల్స్ షేర్ హోల్డర్లకు 42.7 శాతం వాటాలు దక్కనున్నాయి. ఆస్టర్ డీఎం ఫౌండర్ ఆజాద్ మూపెన్(Azad Moopen) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ హోదాలో కొనసాగుతారు. ఇక కేర్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ ఖన్నా(Varun Khanna) సీఈఓగా పని చేస్తారు.