మరో వెయ్యి మందిని తొలగించిన Byjus..!

by Vinod kumar |   ( Updated:2023-02-04 09:08:34.0  )
మరో వెయ్యి మందిని తొలగించిన Byjus..!
X

బెంగళూరు: ప్రముఖ ఎడ్ టెక్ యునికార్న్ సంస్థ బైజుస్ మరోసారి భారీ సంఖ్యల్లో ఉద్యోగాలను తొలగించినట్టు తెలుస్తోంది. గతేడాది అక్టోబర్ లో 2,500 మందిని ఇంటికి పంపిన కంపెనీ ఈసారి 1,000 మందిని తొలగించినట్లు ఓ నివేదిక తెలిపింది. తొలగించిన వారిలో అత్యధికంగా డిజైన్, ఇంజనీరింగ్, నిర్వహణ విభాగాల్లోని ఉద్యోగులు ప్రభావితమయ్యారు. ఖర్చుల నియంత్రణ ద్వారా మెరుగైన నిర్వహణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ వర్గాలు చెప్పినట్టు నివేదిక పేర్కొంది. గతేడాది తొలగింపుల సమయంలో, కంపెనీ సీఈఓ రవీందర్ ఆర్థిక మాంద్యం పరిణామాల మధ్య తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇకమీదట తొలగింపులు ఉండవని కూడా అన్నారు. కానీ నెలల వ్యవధిలోనే మరో వెయ్యి మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపడం గమనార్హం.

తొలగించిన విభాగాల్లో నిర్వహణ, కస్టమర్ కేర్, లాజిస్టిక్స్, మార్కెటింగ్, సేల్స్, ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ లను ఔట్ సోర్సింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. నివేదికల ప్రకారం, తాజా తొలగింపుల విషయం గురించి ఉద్యోగులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. నోటీస్ పీరియడ్ అనంతరం పరిహారానికి సంబంధించిన చెల్లింపులు చేస్తామని బైజూస్ హామీ ఇచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. కాగా, గత కొన్నాళ్ళ నుంచి బైజూస్ భారీ నష్టాలను ఎదుర్కొంటున్నది. దాన్ని అధిగమించేందుకే ఉద్యోగుల తొలగింపులు చేపడుతున్నట్టు నివేదికలు పేర్కొన్నాయి.

ఇవి కూడా చదవండి : నీట్‌ అభ్యర్ధుల కోసం టూల్‌ కిట్‌‌ను విడుదల చేసిన ఆకాష్‌ బైజూస్‌

Advertisement

Next Story

Most Viewed