బైకాట్ జియో.. పోర్ట్ టు బీఎస్ఎన్ఎల్!.. సోషల్ మీడియాలో పోస్టులు వైరల్

by Ramesh Goud |   ( Updated:2024-07-06 13:25:26.0  )
బైకాట్ జియో.. పోర్ట్ టు బీఎస్ఎన్ఎల్!.. సోషల్ మీడియాలో పోస్టులు వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ టెలికాం కంపెనీ జియోను బైకాట్ చేసి ప్రభుత్వ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ కి మారాలని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలు అయిన జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలు తమ టారిఫ్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ టెలికాం కంపెనీల వినియోగదారులకు ఈ నెల నుంచి అదనపు భారం పడనుంది. టెలికాం సంస్థలు తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.

ప్రైవేట్ టెలికం సంస్థలు ఇష్టానుసారంగా టారిఫ్ రేట్లను పెంచుతున్నాయని, ఇలా అయితే సామాన్యుడు టెలికాం సేవలను ఎలా వినియోగించుకోగలడు అని నెట్టింట ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక మరోవైపు 5జీ సేవలపై పెట్టిన నిబంధనలకు జియో సంస్థపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జియోను బైకాట్ చేయాలని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ కు మారాలని సూచిస్తున్నారు. ప్రైవేట్ టెలికాం సంస్థలు టారిఫ్ రేట్లను పెంచుతున్నందున బీఎస్ఎన్ఎల్ సేవలు మరింత మెరుగు పరచాలని.. ఈ సమయాన్ని ఒక అవకాశంగా తీసుకోవాలని నెటిజన్లు ప్రభుత్వాన్ని సూచిస్తున్నారు.

ఈ సందర్భంగా బైకాట్ జియో అనే హ్యాష్ టాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. టెలికాం కంపెనీలపై జియో గుత్తాధిపత్యాన్ని పూర్తిగా పోయేలా.. బీఎస్ఎన్ఎల్ ను ట్రెండింగ్ లోకి తీసుకొని రావాలని తెగ పోస్టులు పెడుతున్నారు. అంతేగాక జియో, అంబానీలకు సంబందించిన మీమ్స్ ను నెట్టింట షేర్ చేస్తున్నారు. దీనిపై స్పందిస్తున్న కొందరు నెటిజన్లు మేము జియో నుంచి బీఎస్ఎన్ఎల్ కు మారామని చెబుతూ.. దానికి సంబందించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed