Boeing: బోయింగ్ కంపెనీ సంచలన నిర్ణయం..17 వేల మంది సిబ్బందిపై వేటు..!

by Maddikunta Saikiran |
Boeing: బోయింగ్ కంపెనీ సంచలన నిర్ణయం..17 వేల మంది సిబ్బందిపై వేటు..!
X

దిశ, వెబ్‌డెస్క్:దిగ్గజ విమానల తయారీ సంస్థ బోయింగ్(Boeing) సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 17 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. కాగా అమెరికా(US)లోని సియాటెల్(Seattle) ప్రాంతంలో ఆ సంస్థకు చెందిన 33 వేల మంది సిబ్బంది నెల రోజులు నుంచి సమ్మె చేస్తున్నారు. దీంతో 737 MAX, 777 X విమానాల ఉత్పత్తి నిలిచిపోయింది. సమ్మె కారణంగా 2025లో డెలివరీ చేయాల్సిన విమానాలను 2026కు వాయిదా వేసింది. అలాగే కార్మికుల సమ్మె కారణంగా మూడో త్రైమాసికంలో 5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.42,068 కోట్ల) నష్టం వాటిల్లినట్టు కంపెనీ తెలిపింది. కంపెనీ తీవ్రమైన ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ సీఈవో కెల్లీ ఓర్ట్‌బెర్గ్(Kelly Ortberg) తెలిపారు. ఈ మేరకు ఉద్యోగులకు ఈ-మెయిల్(E-mail) ద్వారా సందేశం పంపారు. ఆర్ధిక నష్టాల నుంచి బయటపడేందుకు రాబోయే రోజుల్లో మరింత మందిని తొలగిస్తామని, వీరిలో మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్‌లు ఉండనున్నారని ఆయన తెలిపారు.

Next Story

Most Viewed