BMW సరికొత్త మోడల్.. 3.5 సెకన్లలో 100 కి.మీ.. ధర రూ.1.53 కోట్లు

by Disha Web Desk 17 |
BMW సరికొత్త మోడల్.. 3.5 సెకన్లలో 100 కి.మీ.. ధర రూ.1.53 కోట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ లగ్జరీ వాహనాల తయారీ కంపెనీ BMW ఇండియాలో కొత్త మోడల్ కారును విడుదల చేసింది. దీని పేరు 'M4 కాంపిటీషన్ M xDrive'. ఇది సరికొత్త డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుందని, తిరుగులేని శక్తి, అద్భుతమైన హ్యాండ్లింగ్, స్పోర్టీ స్టైలింగ్ డిజైన్‌తో మార్కెట్లోకి వచ్చిందని BMW గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవా ఒక ప్రకటనలో తెలిపారు. కారు ధర రూ. 1,53,00,000(రూ.1.53 కోట్లు)ఎక్స్-షోరూమ్. ఇది కేవలం 3.5 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. దీనిలో Turbo S58 సిక్స్-సిలిండర్ ఇన్-లైన్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. 3.0-లీటర్ పవర్‌ప్లాంట్ డైనమిక్ పవర్ డెలివరీ చేస్తుంది. ఇంజిన్ గరిష్టంగా 530 హార్స్‌పవర్ , 650 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కారు లోపల 4.9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్,12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లేను అమర్చారు. ప్రయాణికుల భద్రత పరంగా డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్ కోసం హెడ్, సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు అలాగే వెనుక సీట్లకు హెడ్ ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా అందించారు. కారు స్కైస్క్రాపర్ గ్రే, పోర్టిమావో బ్లూ, బ్లాక్ సఫైర్, సావో పాలో ఎల్లో, టొరంటో రెడ్, బ్రూక్లిన్ గ్రే, ఐల్ ఆఫ్ మ్యాన్ గ్రీన్, అవెంచురిన్ రెడ్, ఆల్పైన్ వైట్ నాన్-మెటాలిక్ కలర్స్‌లలో లభిస్తుంది. దీనిని BMW డీలర్‌షిప్ నెట్‌వర్క్‌లో, కంపెనీ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

Next Story

Most Viewed