- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Indian Banking: బ్యాంకింగ్ రంగంలో లిక్విడిటీ సమస్య
దిశ, బిజినెస్ బ్యూరో: భారత బ్యాంకింగ్ రంగం లిక్విడిటీ సమస్యను ఎదుర్కొంటోంది. బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గడం ఇందుకు కారణం. తాజాగా ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపొందించిన నివేదిక ప్రకారం, ఈ నెలలో అంటే ఆగష్టు 28 నాటికి బ్యాంకింగ్ లిక్విడిటీ రూ. 0.95 లక్షల కోట్లకు తగ్గింది. ఆగష్టు నెల ప్రారంభంలో 2వ తేదీన బ్యాంకింగ్ లిక్విడిటీ గరిష్ఠ స్థాయి రూ. 2.86 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఆ తర్వాత ఆగష్టు 16న రూ. 1.55 లక్షల కోట్లకు తగ్గగా, తాగా ఇది మరింత దిగొచ్చింది. పరిస్థితిని గమనించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ), ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు సూచించాయి. అయినప్పటికీ లిక్విడిటీ కొరత కొనసాగుతోంది. బ్యాంకింగ్ లిక్విడిటీ నిరంతరం క్షీణించడం వల్ల ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం ఉంటుందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో కంటే ఇటీవల చాలామంది బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం కంటే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, ఇతర పెట్టుబడి సాధనాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దానివల్ల బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గుతున్నాయి. దీనిపై బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఈ నెల ప్రారంభంలోనూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బ్యాంకులు రుణాలతో పాటు డిపాజిట్లు పెరిగే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.