Bank of India hikes interest rates on fixed deposits

by Harish |   ( Updated:2023-01-10 14:54:59.0  )
Bank of India hikes interest rates on fixed deposits
X

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఫిక్స్‌డ్ డిపాజిట్ల రేట్లను సవరించింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటనలో తెలిపింది. సవరించిన రేట్లు జనవరి 10 నుంచే అమల్లోకి వస్తాయని, దీంతో ఎఫ్‌డీలపై వడ్డీ 3 శాతం నుంచి గరిష్ఠంగా 7.05 శాతం వరకు ఉండనున్నట్లు వెల్లడించింది. సీనియర్ సిటిజన్లు ఆరు నెలల నుంచి ఏడాది లోపు డిపాజిట్లపై అదనంగా 0.50 శాతం ఎక్కువ వడ్డీని పొందుతారని బ్యాంకు పేర్కొంది.

అదే మూడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై అదనంగా 0.75 శాతం వడ్డీ అందుకుంటారని వెల్లడించింది. ఇక, 444 రోజుల ప్రత్యేక టర్మ్ డిపాజిట్‌పై సాధారణ ఖాతాదారులు 7.05 శాతం వడ్డీని తీసుకుంటారని, సీనియర్ సిటిజన్లు 7.55 శాతం వడ్డీని అందుకోవచ్చని బ్యాంకు వివరించింది.

బ్యాంకు వివరాల ప్రకారం, 7-45 రోజుల డిపాజిట్లకు 3 శాతం, 46-179 రోజుల కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీలకు 4.50 శాతం, 180-269 రోజుల డిపాజిట్లపై 5 శాతం, 270-ఏడాది కాలానికి 5.5 శాతం, 1-2 ఏళ్ల వ్యవధి(444 రోజుల ఎఫ్‌డీ మినహా)కి 6 శాతం, 444 రోజుల డిపాజిట్లకు అత్యధికంగా 7.05 శాతం, 2-3 ఏళ్ల ఎఫ్‌డీలకు 6.75 శాతం, 3-5 ఏళ్లకు 6.50 శాతం వడ్డీ లభిస్తుందని బ్యాంకు పేర్కొంది.

READ MORE

ఆర్‌బీఐ నుంచి పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్‌ పొందిన భారత్‌పే, హిటాచీ!

Advertisement

Next Story