- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన బ్యాంక్ ఆఫ్ బరోడా!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ) వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. రూ. 2 కోట్ల వరకు డిపాజిట్లపై 30 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయించింది. సవరించిన రేట్లు శుక్రవారం(మే 12) నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ)లో సాధారణ ఖాతాదారుల ఎఫ్‌డీలపై కనిష్టంగా 3 శాతం నుంచి గరిష్ఠంగా 7.05 శాతం వడ్డీ ఇవ్వనుంది. సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 7.55 శాతం వడ్డీ రాబడిని బ్యాంక్ ఆఫర్ చేస్తోంది.
బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ వివరాల ప్రకారం, సాధారణ ఖాతాదారులకు 7-45 రోజులకు 3 శాతం, 46-180 రోజులకు 4.5 శాతం, 181-210 రోజులకు 5.25 శాతం, 211 రోజుల నుంచి ఏడాది కాలవ్యవధి ఉన్న డిపాజిట్లపై 5.75 శాతం, 1-2 ఏళ్లకు 6.75 శాతం, 2-3 ఏళ్లకు 7.05 శాతం, 3-10 ఏళ్లకు 6.50 శాతం వడ్డీ ఇవ్వనుంది.
సీనియర్ సిటిజన్లకు అన్ని కాలవ్యవధులపై అదనంగా 0.50 శాతం వడ్డీ ఆదాయం లభిస్తుంది. 399 రోజుల కాల వ్యవధి కలిగిన ప్రత్యేక డిపాజిట్ పథకం 'బరోడా తిరంగా ప్లస్ 'కు అధికంగా 7.25 శాతం వడ్డీ ఇవ్వనుంది.