Aviation Industry: దీపావళి సీజన్‌ సందర్భంగా 25 శాతం తగ్గిన విమాన టికెట్ ధరలు

by S Gopi |
Aviation Industry: దీపావళి సీజన్‌ సందర్భంగా 25 శాతం తగ్గిన విమాన టికెట్ ధరలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది దీపావళి సీజన్ సందర్భంగా దేశీయంగా ఎయిర్‌లైన్ సంస్థలు విమాన టికెట్లపై భారీ ఆఫర్లు ఇస్తున్నాయి. ముఖ్యంగా దేశీయ రూట్లలో విమాన ఛార్జీలను సగటున గతేడాది కంటే 20-25 శాతం తగ్గించాయని ప్రముఖ ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో పేర్కొంది. ఈ ఏడాది చమురు ధరలు తగ్గడంతో పాటు పండుగ సీజన్ కావడం, ప్రయాణాలకు డిమాండ్ పెరగడంతో ఎయిర్‌లైన్ కంపెనీలు టికెట్ ధరలపై డిస్కౌంట్లు అందిస్తున్నాయి. గడిచిన 30 రోజులను ప్రాతిపదికగా వన్‌వే ఛార్జీల ధరల పరిశీలన ద్వారా ఈ డిస్కౌంట్లు కొనసాగుతున్నాయి. ఇక్సిగో ప్రకారం.. బెంగళూరు-కోల్‌కతా రూట్‌లో సగటున విమాన ఛార్జీలు గరిష్ఠంగా 38 శాతం క్షీణించాయి. 2023 దీపావళి సమయంలో ఈ రూట్లలో రూ. 10,195 వరకు ఉన్న విమాన టికెట్లు ఈ ఏడాది రూ. 6,319గా ఉన్నాయి. చెన్నై-కోల్‌కతా మధ్య టికెట్ ధరలు రూ. 8,725 నుంచి రూ. 5,604(36 శాతం డిస్కౌంట్) ఉన్నాయి. ముంబై-ఢిల్లీ రూట్లో టికెట్ ఛార్జీలు రూ. 8,788 నుంచి రూ. 5,762(34 శాతం), ఢిల్లీ-కోల్‌కతా, హైదరాబాద్-ఢిల్లీ, ఢిల్లీ-శ్రీనగర్ మార్గాల్లో 32 శాతం ధరలు తక్కువగా ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed