అదానీ వ్యవహారంలో సెబీకి లేఖ రాసిన ఎన్‌డీటీవీ ప్రమోటర్లు!

by Hajipasha |
అదానీ వ్యవహారంలో సెబీకి లేఖ రాసిన ఎన్‌డీటీవీ ప్రమోటర్లు!
X

న్యూఢిల్లీ: మీడియా సంస్థ ఎన్‌డీటీవీలో మెజారిటీ వాటా కోసం అదానీ గ్రూప్ ప్రయత్నిస్తున్న సమయంలో సంస్థ ప్రమోటర్లు సెబీకి లేఖ రాశారు. ఎన్‌డీటీవీ ప్రమోటర్ ఆర్ఆర్‌పీఆర్ హోల్డింగ్స్ షేర్లను వీసీపీఎల్‌కు బదిలీ చేడంపై స్పష్టత ఇవ్వాలని సంస్థ ప్రఓటర్లుగా ఉన్న ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌లు లేఖలో పేర్కొన్నారు. ఆర్ఆర్‌పీఆర్ హోల్డింగ్స్‌కు ఇచ్చిన అప్పుని వాటా రూపంలోకి మార్చుకునేందుకు వీసీపీఎల్ యాజమాన్య సంస్థ అదానీ గ్రూప్ ప్రకటించింది. అయితే, ఈ వ్యవహారానికి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని ప్రమోటర్లు తెలిపారు. అదేవిధంగా సెబీకి పంపిన లేఖలో ఆర్ఆర్‌పీఆర్ ప్రమోటర్ వాటాలను దక్కించుకునేందుకు వీసీపీల్‌కు సెబీ అనుమతి అవసరమని పేర్కొంది.

అలాగే, ఎన్‌డీటీవీ ప్రమోటర్లపై రెండేళ్ల వరకు సెబీ నిషేధం విధించిందని, కాబట్టి వారు ఎలాంటి సెక్యూరిటీ లావాదేవీ నిర్వహించేందుకు అవకాశం లేదని లేఖలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్‌పీఆర్ వాటాలను వీసీపీఎల్‌కు బదిలీ చేసేందుకు ప్రమోటర్లకు కుదరదని వివరించింది. దీనికి సంబంధించి ఎన్‌డీటీవీ చెబుతున్న అంశాన్ని అదానీ గ్రూప్ నిరాకరిస్తోంది. సెక్యూరిటీ మార్కెట్లలో లావాదేవీల నిషేధం కేవలం ఎన్‌డీటీవీ ప్రమోటర్లకు మాత్రమే వర్తిస్తుందని, ఆర్ఆర్‌పీఆర్‌కు ఇందులో సంబంధం లేదని చెబుతోంది. ఈ క్రమంలోనే ఎన్‌డీటీవీ ప్రమోటర్లు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి లేఖ రాశారు.

Advertisement

Next Story

Most Viewed