- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Fiscal Deficit: తొలి త్రైమాసికంలో ఆర్థిక లోటు రూ. 1.36 లక్షల కోట్లు
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌తో ప్రారంభమైన తొలి త్రైమాసికంలో భారత ఆర్థిక లోటు రూ. 1.36 లక్షల కోట్లుగా ఉందని ప్రభుత్వ గణాంకాలు బుధవారం ప్రకటనలో వెల్లడించాయి. ఈ మొత్తం 2024-25 అంచనాలో 8.1 శాతానికి సమానం. ఏప్రిల్-జూన్ మధ్య మొత్తం వసూళ్లు రూ. 8.34 లక్షల కోట్లు(వార్షిక లక్ష్యంలో 27.1 శాతం)గా ఉన్నాయని, గతేడాది ఇదే కాలంలో వచ్చిన 22.1 శాతంగా నమోదైనట్టు డేటా పేర్కొంది. అలాగే, సమీక్షించిన కాలంలో మొత్తం ప్రభుత్వం వ్యయం రూ. 9.7 లక్షల కోట్లకు చేరుకోగా, ఇది వార్షిక లక్ష్యంలో 20.4 శాతానికి సమానం. గతేడాది ఇదే సమయంలో రూ. 10.51 లక్షల కోట్లతో పోలిస్తే తక్కువగా ఖర్చు అయ్యాయి. మొత్తం వసూళ్లలో పన్ను ఆదాయం రూ. 5.50 లక్షల కోట్లు కాగా, పన్నేతర ఆదాయం రూ. 2.80 లక్షల కోట్లు. ఆర్‌బీఐ నుంచి రూ. 2.11 లక్షల కోట్ల డివిడెండ్ రావడంతో పన్నేతర్వ ఆదాయం పెరిగింది. అలాగే, సార్వత్రిక ఎన్నికల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో ప్రభుత్వ ఖర్చులు తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. మెరుగైన పన్నుల రాబడి కారణంగా భారత ప్రభుత్వం గతవారం బడ్జెట్ ప్రకటనలో ఆర్థిక లోటును 4.9 శాతానికి తగ్గించింది. అంతకుముందు ఫిబ్రవరిలో సమర్పించిన మధ్యంతర బడ్జెట్‌లో జీడీపీలో 5.1 శాతంగా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రధాని మోడీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మిత్రపక్షాలకు చెందిన రాష్ట్రాలకు, ఉద్యోగాల కల్పనకు అధిక కేటాయింపులు చేసినప్పటికీ ఆర్థిక లోటును తగ్గించడం గమనార్హం. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయం, మొత్తం ఖర్చుల మధ్య ఉండే వ్యత్యాసాన్ని ఆర్థిక లోటుగా పరిగణిస్తారు.