- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌లో యాపిల్ ఎయిర్‌పాడ్‌ల తయారీ కాంట్రాక్టు పొందిన ఫాక్స్‌కాన్!
హైదరాబాద్: గ్లోబల్ దిగ్గజం యాపిల్ తన ఎయిర్‌పాడ్‌ల తయారీ కోసం తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌కు కాంట్రాక్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకోసం భారత్‌లో ఉత్పత్తిని చేపట్టేందుకు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు సంబంధిత వ్యక్తులు తెలిపారు. ఇప్పటివరకు ఫాక్స్‌కాన్ సంస్థ ఐఫోన్, ఇతర సెమీకండక్టర్ల తయారీని మాత్రం అందించింది. ఇకమీదట యాపిల్ ఎయిర్‌పాడ్‌లను కూడా తయారు చేయనుంది. గత కొంతకాలంగా యాపిల్ కంపెనీ చైనా నుంచి తన తయారీని ఇతర దేశాలకు విస్తరించాలని చూస్తోంది. ఇదే సమయంలో భారత్‌లో తన కార్యకలాపాలను మరింత పెంచి, స్థానిక తయారీని వేగవంతం చేయాలనే లక్ష్యంగా ఉంది. అందుకే ప్రస్తుతం ఎయిర్‌పాడ్‌లను సరఫరా చేస్తున్న చైనా కంపెనీలను కాదని, భారత్‌లో కాంట్రాక్ట్ ఉన్న ఫాక్స్‌కాన్‌తో యాపిల్ ఒప్పందం చేసుకుంది.
ఇటీవల ఫాక్స్‌కాన్ సీఈఓ యాంగ్ లియు భారత పర్యటన సందర్భంగా తెలంగాణలో ప్లాట్ ఏర్పాటు ఉంటుందని స్పష్టం చేశారు. దాన్నిబట్టి కాంట్రాక్ట్ ఒప్పంద ప్రక్రియ అనంతరం ఎయిర్‌పాడ్‌ల తయారీని తెలంగాణలో ఏర్పాటయ్యే అవకాశం ఉంది. పరిశ్రమ వర్గాల ప్రకారం, కొత్త తయారీ ప్లాంట్ కోసం 200 మిలియన్ డాలర్ల(సుమారు రూ. 1,654 కోట్లు) పెట్టుబడులు ఉండొచ్చు. అయితే, ఈ వ్యవహారానికి సంబంధించి ఫాక్స్‌కాన్ సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అనుకున్నట్టే జరిగితే రంగారెడ్డీలో ఫాక్స్‌కాన్ తయారీ ప్లాంట్ నెలకొల్పి, 2024 చివరి నాటికి తయారీని ప్రారంభించనుంది.
Also Read..