తొలిసారిగా అత్యధిక మార్కెట్ వాటాతో ఐఫోన్ అగ్రస్థానం!

by Vinod kumar |   ( Updated:2023-01-10 12:15:08.0  )
తొలిసారిగా అత్యధిక మార్కెట్ వాటాతో ఐఫోన్ అగ్రస్థానం!
X

న్యూఢిల్లీ: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో అనూహ్యగా యాపిల్ అగ్రస్థానంలో నిలిచింది. గ్లోబల్ టెక్నాలజీ మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తాజా నివేదిక ప్రకారం, 2022, డిసెంబర్ త్రైమాసికంలో 4 శాతం అమ్మకాల మార్కెట్ వాటాతో యాపిల్‌కు చెందిన ఐఫోన్ 13 మోడల్ ఎక్కువగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. దీని తర్వాత శాంసంగ్ గెలాక్సీ ఎం13, రెడ్‌మీ ఏ1, శాంసంగ్ గెలాక్సీ ఎం4ఎస్, రియల్‌మీ సీ35 మోడల్ స్మార్ట్‌ఫోన్‌లు 3 శాతం చొప్పున మార్కెట్ వాటాను దక్కించుకున్నాయి. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అమ్మకాల పరంగా యాపిల్‌కి చెందిన ఐఫోన్ అగ్ర స్థానంలో నిలవడం ఇదే తొలిసారి కావడం విశేషం.

గతేడాది ఇదే త్రైమాసికంలో రియల్‌మీ సీ11, ఒప్పో ఏ54, గెలాక్సీ ఎం12, రెడ్‌మీ నోట్ 10ఎస్, రెడ్‌మీ 9ఏ అత్యధికంగా అమ్ముడైన ఐదు స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో ఉన్నాయి. అయితే ఈ ఫోన్‌లు రూ. 15,000 వద్ద అందుబాటులో ధరలో ఉన్నవే, కానీ ఐఫోన్ 13 మాత్రం రూ. 50,000-70,000 మధ్య ఉన్నప్పటికీ అమ్మకాల్లో అధిక వాటా దక్కించుకోవడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, ఆఫ్‌లైన్ దుకాణదారులు ఐఫోన్ 13 మోడల్‌పై అత్యధిక డిస్కౌంట్ ఆఫర్లు ఇవ్వడంతో భారీ అమ్మకాలు నమోదయ్యాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

ఇవి కూడా చదవండి : మార్చి నాటికి టాటా ఐఫోన్ తయారీపై స్పష్టత!

Advertisement

Next Story

Most Viewed