- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక అమెజాన్ ప్రైమ్‌లో స్పష్టంగా డైలాగ్‌లు.. అందుబాటులోకి కొత్త ఫీచర్
దిశ, వెబ్‌డెస్క్: వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ తన వినియోగదారుల కోసం కొత్తగా ఒక ఫీచర్‌ను తెచ్చింది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసేటప్పుడు స్పష్టమైన సంభాషణల(డైలాగులు) కోసం 'డైలాగ్ బూస్ట్' అనే కొత్త యాక్సెసిబిలిటీ ఫీచర్‌ను విడుదల చేసింది. దీని ద్వారా పాటలు, యాక్షన్ సీన్స్ మొదలగు సమయాల్లో డైలాగులను మరింత స్పష్టంగా వినవచ్చని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం సినిమాలు/వెబ్ సిరీస్‌లు చూసేటప్పుడు కొన్ని డైలాగులు అర్థం కాక యూజర్లు ఇబ్బందిపడేవారు. ఇప్పుడు ఈ కొత్త ఫీచర్ ద్వారా ఆ సమస్య తీరనుంది.
ఇలాంటి డైలాగ్-బూస్టింగ్ ఫీచర్‌లు హై-ఎండ్ థియేటర్ సిస్టమ్‌లు, ప్రత్యేక ఆడియో డివైజ్‌లు, కొన్ని స్మార్ట్ టీవీలలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, OTT ఫ్లాట్‌ఫామ్‌లలో అమెజాన్ ప్రైమ్ వీడియో మాత్రమే మొదటిసారిగా ఈ ఫీచర్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. డైలాగ్ బూస్ట్ ఫీచర్ కోసం, కస్టమర్‌లు ప్లేబ్యాక్ సమయంలో ఆడియో, సబ్‌టైటిల్స్ మెనుపై క్లిక్ చేసి మీడియం లేదా హై అనే ఆప్షన్స్ ఎంచుకోవాలి.