- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇంటి వద్దనే రూ.2 వేల నోట్లను మార్చుకునే అవకాశాన్ని ఇస్తోన్న Amazon
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఆర్‌బీఐ రూ.2000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నోట్లను మార్చుకోవడానికి గడువు కూడా ఇచ్చింది. ప్రజలు తమ దగ్గర ఉన్న నోట్లను మార్చుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత మంది బ్యాంకులకు వెళ్లడానికి తీరిక లేక షాపింగ్ చేసేటప్పుడు కానీ లేదా పెట్రోల్ బంకుల్లో కానీ రూ. 2000 నోట్లను మార్చుకుంటున్నారు.
కానీ చాలా మంది ఈ నోట్లను తీసుకు వస్తుండటంతో బంకుల్లో, వ్యాపారస్తులు ఈ నోట్లను తీసుకోవడం లేదు. దీంతో ఈ నోట్లను ఎలా మార్చుకోవాలని ఆలోచిస్తున్న వారికి ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ ఉపశమనాన్ని అందిస్తుంది. అమెజాన్ తాజాగా తన వినియోగదారుల కోసం రూ.2000 నోట్లు మార్చుకునే అవకాశాన్ని అందిస్తుంది. ఈ ప్రాసెస్ కూడా మొత్తం ఇంటి దగ్గరే పూర్తవుతుంది.
అమెజాన్‌లో ఏదైనా ఉత్పత్తులను ఆర్డర్ పెట్టినప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకోవాలి. దీంతో డెలివరీ బాయ్ వచ్చినప్పుడు రూ.2000 నోట్లు ఇస్తే, ఆర్డర్‌కు పోగా మిగిలిన అమౌంట్‌ను అమెజాన్ పే బ్యాలెన్స్ అకౌంట్లో యాడ్ చేస్తారు. దీంతో ఆ అమౌంట్‌ను మిగిలిన అవసరాలకు వాడుకోవచ్చు. KYC పూర్తి చేసుకున్న కస్టమర్లు మాత్రమే ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు. నెలలో గరిష్టంగా రూ.50 వేల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.