NFO: రూ.100 ఉంటే చాలు.. ఈ స్కీమ్‌తో బెనిఫిట్‌ పొందవచ్చు.. లాస్ట్‌ డేట్ ఎప్పుడంటే?

by Vennela |
NFO: రూ.100 ఉంటే చాలు.. ఈ స్కీమ్‌తో బెనిఫిట్‌ పొందవచ్చు.. లాస్ట్‌ డేట్ ఎప్పుడంటే?
X

దిశ, వెబ్ డెస్క్: NFO Review : మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds) ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్. ఇప్పుడ మరో కొత్త స్కీము అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే దీని సబ్ స్క్రిప్షన్ కూడా మొదలైంది. ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఇది కొనసాగుతోంది. ఇందులో కనీస పెట్టుబడి రూ. 100 నుంచే మొదలువుతుంది. ఆ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds) ఇన్వెస్టర్లలో చాలా మంది కొత్త ఫండ్స్ ఆఫర్స్ కోసం వేచిచూస్తుటారు. అలాంటి వారందరికీ మరో కొత్త ఫండ్ అందుబాటులోకి వచ్చింది. అదే యాక్సెస్ మ్యూచువల్ ఫండ్ తీసుకువచ్చిన యాక్సిస్ నిఫ్టీ 500 మూమెంటమ్ 50 ఇండెక్స్ ఫండ్ (Axis Nifty 500 Momentum 50 Index Fund). ఇదొక ఓపెన్ ఎండెడ్ ఇండెక్స్ ఫండ్. ఈ స్కీము బెంజ్ మార్కెట్ ఇండెక్స్ నిఫ్టీ 500 మూమెంటమ్ 50 టీఆర్ఐ ఉంటుంది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ ఇప్పటికే సబ్ స్క్రిప్షన్ కూడా మొదలైంది. అలాగే ఫిబ్రవరి 7,2025 వరకు సబ్ స్క్రిప్షన్ అందుబాటులో ఉంటుంది.

ఈ కొత్త స్కీమ్ ప్రధానంగా నిఫ్టీ 500 మూమెంటమ్ 50 టీఆర్ఐ ఆధారంగా దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందించాలనే లక్ష్యంతో తీసుకువచ్చినట్లు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్(Axis Mutual Fund) వెల్లడించింది. ఈ కొత్త ఫండ్ ను కార్తిక్ కుమార్, సచిన్ రెలేకర్ నిర్వహిస్తారని తెలిపింది. పాసివ్ స్ట్రాటజీలు పాపులర్టీ పొందుతున్నాయి. మూమెంటమ్ ఆధారంగా రాణించే స్టాక్స్ పెట్టుబడి పెట్టేందుకు ఇదొక సరైన ఎంపికగా తాము భావిస్తున్నాం. తక్కువ ఖర్చులో వైవిధ్యమైన స్టాక్స్ ను ఎంచుకోవచ్చు. ఎలాంటి కీలక నిర్ణయాలు లేకుండా మార్కెట్ ట్రెండ్స్ ను బట్టి ప్రయోజనాలను పొందాలనుకుంటున్నట్లు ఇన్వెస్టర్లకు ఇదొక మంచి ప్రొడక్టుగా చెప్పవచ్చని యాక్సెస్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో బి గోప్ కుమార్ తెలిపారు.

కాగా ఈ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్(Axis Mutual Fund) తీసుకువచ్చిన ఈ స్కీమ్ కనీస అప్లికేషన్ ధర రూ. 100గా ఉంది. ఆ తర్వాత 100 చెప్పున ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే రోజువారీ వారం, నెలలవారీగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ రూ. 100 ఆపై ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే ఏడాది సిప్ పెట్టుబడి అయితే ఒకేసారి రూ. 1200కట్టాలి. ఆ తర్వాత ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు.

ఈ స్కీములో పెట్టుబడి పెట్టిన తర్వాత అలాట్మెంట్ అయిన 15రోజుల్లోనే డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే ఎగ్జిట్ లోడ్ 0.25 శాతం పడుతుంది. అయితే 15రోజులు దాటితే మాత్రం ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు. రెగ్యులేషన్ 52(6)(c) ప్రకారం మాగ్జిమ్ టోటల్ ఎక్స్ ప్రెన్స్ రేషియో 1శాతం వరకు ఉంటుంది. ఈ స్కీములో పెట్టే డబ్బుల్లో 95-100 శాతం నిఫ్టీ 500 మూమెంటర్ 50 ఇండెక్స్ లోని సెక్యూరిటీల్లో పెట్టుబడి పెడతారు. మిగిలిన 0-5శాతం డబ్బులను డెట్, మనీ మార్కెట్ ఇన్ స్ట్రూమెంట్స్ లో పెట్టుబడి పెడతారు.

ఈ NFOలో డబ్బును పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులు ఈక్విటీ ఫండ్లలో దీర్ఘకాలిక పెట్టుబడిని ఉత్తమంగా పరిగణించాలని గుర్తుంచుకోవాలి. అలాగే, మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గించడానికి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా పెట్టుబడి పెట్టడం మంచిదని భావిస్తారు.

(గమనిక: ఈ కథనం ఉద్దేశ్యం సమాచారం అందించడం మాత్రమే, పెట్టుబడి సలహా ఇవ్వడం కాదు. మ్యూచువల్ ఫండ్ గత రాబడి భవిష్యత్తులో కొనసాగుతుందని హామీ ఇవ్వదు. పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు SEBIని సంప్రదించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి.)

Next Story

Most Viewed