7 నుంచి 12 వ తరగతి విద్యార్థులకు 100% స్కాలర్‌షిప్‌ ఇస్తోన్న ఆకాష్‌ బైజూస్‌

by Harish |   ( Updated:2022-11-23 14:56:34.0  )
7 నుంచి 12 వ తరగతి విద్యార్థులకు 100% స్కాలర్‌షిప్‌ ఇస్తోన్న ఆకాష్‌ బైజూస్‌
X

దిశ, వెబ్‌డెస్క్: టెస్ట్‌ ప్రిపరేటరీ సేవలలో జాతీయ అగ్రగామి సంస్ధ ఆకాష్‌ బైజూస్‌, తమ ప్రతిష్టాత్మక వార్షిక స్కాలర్‌షిప్‌ పరీక్ష ఆకాష్‌ నేషనల్‌ హంట్‌ ఎగ్జామ్‌ (ANTHE)2022 పదమూడవ ఎడిషన్‌ కోసం కరీంనగర్‌ నగరం నుంచి అత్యధికంగా 3718 విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఇనిస్టిట్యూట్‌ ఇప్పటివరకూ 25 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్‌లను అందుకుంది. 2010లో ANTHE ప్రారంభించిన తరువాత ఇది అత్యధికం.

ANTHE 2022 ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 05 నుంచి 13, 2022 వరకు, ఆఫ్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 06 నుంచి 13 వరకు దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నిర్వహించనున్నారు.

గత ఎడిషన్‌ ANTHE లాగానే విభిన్న గ్రేడ్‌ల నుంచి ఐదుగురు విజేతలకు ఉచితంగా నాసా ను తమ తల్లిదండ్రులలో ఒకరు తోడుగా సందర్శించే అవకాశం కలుగుతుంది. అత్యున్నత ర్యాంక్‌ సాధించిన విద్యార్ధులు 2 లక్షల రూపాయల నగదు బహుమతి సైతం పొందేందుకు అర్హులు.

ఈ పరీక్ష 90 మార్కులకు జరుగుతుంది. దీనిలో 35 మల్టీపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. ఇవి విద్యార్థుల గ్రేడ్‌, వారి ఆసక్తికి అనుగుణంగా ఉంటాయి. ఏడవ తరగతి 9వ తరగతి విద్యార్థులకు ఈ ప్రశ్నలు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్‌, మెంటల్‌ ఎబిలిటీలో ఉంటాయి. పదవ తరగతి విద్యార్థులు మరీ ముఖ్యంగా వైద్య విద్య నభ్యసించాలనుకునే విద్యార్థులకు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, మెంటల్‌ ఎబిలిటీలో పరీక్ష ఉంటుంది.

ఇంజినీరింగ్‌ చదవాలనుకునే పదవ తరగతి విద్యార్ధులకు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌, మెంటల్‌ ఎబిలిటీలో పరీక్షలు ఉంటాయి. అదే రీతిలో, పదకొండు, పన్నెండవ తరగతి విద్యార్ధులు మరీ ముఖ్యంగా నీట్‌ లక్ష్యంగా చేసుకున్న వారికి ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలో పరీక్షలు ఉండగా, ఇంజినీరింగ్‌ లక్ష్యంగా చేసుకున్న వారికి ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో ప్రశ్నలు ఉంటాయి.

ANTHE 2022 ఫలితాలను 27 నవంబర్‌ 2022న పదవ తరగతి నుంచి 12 వ తరగతి విద్యార్థులకు ప్రకటిస్తే, 29 నవంబర్‌ 2022న ఏడవ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు వెల్లడిస్తారు.

ANTHE 2022 గురించి ఆకాష్‌ బైజూస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ ఆకాష్‌ చౌదరి మాట్లాడుతూ ''దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు వచ్చిన స్పందన పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. మెడికల్‌ కాలేజీలో సీటు లేదంటే ఐఐటీ, ఎన్‌ఐటీ లేదా మరేదైనా కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని కాలేజీలో సీటు రావడంలో గొప్ప మార్పును కోచింగ్‌ తీసుకువస్తుంది. అత్యున్నత విలువ కలిగిన కోచింగ్‌ ప్రోగ్రామ్‌లను దేశవ్యాప్తంగా అర్హులైన, ఆసక్తి కలిగిన విద్యార్థులకు చేరువ చేయాలనేది మా లక్ష్యం. నీట్‌, జెఈఈ కోసం విద్యార్ధులను వారెక్కడ ఉన్నా సిద్ధం చేసేందుకు అనుమతిస్తుంది'' అని అన్నారు.

మరిన్ని వివరాల కోసం https://anthe.aakash.ac.in/anthe లో లాగిన్‌ అవండి.

Advertisement

Next Story

Most Viewed