- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అకాసా ఎయిర్ తొలి అంతర్జాతీయ విమానం ప్రారంభం
by S Gopi |
X
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ కొత్త విమానయాన సంస్థ ఆకాసా ఎయిర్ తన మొదటి అంతర్జాతీయ విమాన కార్యకలాపాలను శుక్రవారం ప్రారంభించింది. ముంబై నుంచి దోహా, ఖతార్‌కు తొలి విదేశీ విమానాన్ని తీసుకొచ్చామని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. కువైడ్, జెడా, రియాద్ అనే మరో మూడు అంతర్జాతీయ గమ్యస్థానాలకు ట్రాఫిక్ హక్కులను పొందామని పేర్కొంది. రాబోయే నెలల్లో ఆకాసా మరింత వేగంగా సంస్థ అంతర్జాతీయ విమానాలను అందుబాటులోకి తీసుకొస్తుందని, అన్ని రూట్లతో విస్తరించేందుకు తగిన ప్రణాళికను రూపొందిస్తున్నట్టు వెల్లడించింది. అంతేకాకుండా అనుకూలమైన విమానాల షెడ్యూల్‌తో అహ్మదాబాద్, గోవా, వారణాసి, లక్నో, బెంగళూరు, కొచ్చి, ఢిల్లీ సహా దేశీయ ఇతర నగరాల నుంచి ప్రయాణీకులు ముంబై మీదుగా దోహాకు ప్రయాణించడానికి వివిధ కనెక్టింగ్ ఆప్షన్‌లు ఏర్పాటు చేశామని ఆకాసా ఎయిర్ వివరించింది.
Advertisement
Next Story